Ys Jagan: మేయర్, డిప్యూటీ ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి సంచలనం రేపిన వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్‌లకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2021, 11:20 PM IST
  • డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
  • ఇద్దరు డిప్యూటీ మేయర్, ఇద్దరు వైస్ ఛైర్మన్ పోస్టుల సృష్టి
  • ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు మున్సిపల్ చట్టం సవరణ
Ys Jagan: మేయర్, డిప్యూటీ ఎన్నికల్లో కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్

Ys Jagan: ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి సంచలనం రేపిన వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్‌లకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నిక(Ap Municipal Elections)ల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 18వ తేదీన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాలు ఏర్పడనున్నాయి. మేయర్, ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమించనున్నారు. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ( Special Ordinance) తీసుకురాబోతున్నారు. మున్సిపల్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఆర్డినెన్స్ వచ్చిన తరువాత ఈ నెల 18 న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లను గెల్చుకుని సంచలనం సృష్టించింది. 

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగింది. అటు ప్రజలు మూడు రాజధానులకు మద్దతిచ్చినట్టు కూడా నిరూపితమైంది. 

Also read: By Elections Schedule 2021: తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News