Jagananna Suraksha: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల కోసం ఇప్పటికే వివిధ రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ పధకాలన్నీ అమలు జరుగుతున్నాయో లేవో ఎప్పటికప్పుడు సమీక్షించే కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ కొత్త కార్యక్రమం పేరేంటి, ఎప్పట్నించి ప్రారంభమౌతుందనేది పరిశీలిద్దాం..
ఏపీ ప్రభుత్వం జగనన్న సురక్ష పేరుతో కొత్త కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కొత్త కార్యక్రమం జూన్ 23 నుంచి ప్రారంభం కానుంది.. ప్రతి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా వెంటనే వాటిని పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఇందులో భాగమే ఈ కొత్త కార్యక్రమమని వైఎస్ జగన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి జగనన్న సురక్ష కార్యక్రమం కొనసాగింపుగా ఉంటుంది. ప్రతి సామాన్యుడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, గడప గడపకూ ప్రభుత్వం, ఉపాధి హామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు , ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ నెల 23 నుంచి జూలై 23 వరకూ నెలరోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఇందులో భాగంగా ప్రజలకు సంబంధించిన పత్రాలు, సర్టిఫికేట్లు, ప్రభుత్వ పథకాల సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తారు. ఈ పనుల నిర్వహణ కోసం మండలాధికారులు స్థానికంగా ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించి తక్షణం పరిష్కరిస్తారు. ఎవరి సమస్యైనా తిరస్కరించబడితే ఎందుకు తిరస్కరించారనేది ఆ ఫిర్యాదుదారుడి ఇంటికెళ్లి వివరించాలన్నారు. అప్పటి వరకూ పరిశీలనకు నోచుకోని సమస్యను 24 గంటల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారిని గుర్తించి తక్షణం వారికి ఆ పధకాల లబ్ది పొందేలా చేస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించినవారికి ఆగస్టు 1వ తేదీన అర్హత పత్రాలు అందిస్తారు.
జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. ఇందులో సమస్యల పరిష్కారంలో క్వాలిటీ అనేది చాలా ముఖ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కావడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలన్నారు.
Also read: AP Early Elections: నవంబర్, డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయం, వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook