"నంది"ని పొందిన "సూపర్ స్టార్స్" వీరే

   

Last Updated : Nov 15, 2017, 01:11 PM IST
"నంది"ని పొందిన "సూపర్ స్టార్స్" వీరే

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డులతో పాటు నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను సంబంధించిన ప్రకటనలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జ్యూరీ సభ్యులు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అవార్డు కమిటీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, మురళీ మోహన్‌, గిరిబాబు, జీవిత రాజశేఖర్ పాల్గొన్నారు. 

అవార్డు వివరాలు ఇవే

2014 

ఉత్తమ చిత్రం - లెజెండ్‌,   ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం, తృతీయ ఉత్తమ చిత్రం - హితుడు, ఉత్తమ కుటుంబ కథా చిత్రం - టామీ, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - లౌక్యం, ఉత్తమ విద్యాప్రధాన చిత్రం - క్విట్ స్మోకింగ్, ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం - ప్రభంజనం, ఉత్తమ బాలల చిత్రం - ఆత్రేయ, ద్వితీయ ఉత్తమ బాలల చిత్రం - రాకెట్టు, ఉత్తమ బాలల చిత్ర దర్శకుడు - బి.సుధాకర్ (ఆదిత్య),   ఉత్తమ నటుడు - బాలకృష్ణ(లెజెండ్‌),  ఉత్తమ నటి- అంజలి(గీతాంజలి), ఉత్తమ ప్రతినాయకుడు - జగపతిబాబు(లెజెండ్‌), ఉత్తమ సహాయ నటుడు - నాగచైతన్య(మనం), ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి (చందమామ కథలు), ఉత్తమ హాస్యనటులకు అందించే అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం - బ్రహ్మానందం (రేసుగుర్రం), ఉత్తమ సహాయనటులకు అందించే  ఎస్వీ రంగారావు స్మారక పురస్కారం - రాజేంద్రప్రసాద్ (టామీ), ఉత్తమ హాస్య నటి - విద్యుల్లేఖ రామన్ (రన్ రాజా రన్), ఉత్తమ బాల నటుడు - గౌతమ్ కృష్ణ (వన్), ఉత్తమ బాలనటి - అనూహ్య (ఆత్రేయ),  తొలి చిత్ర దర్శకుడు - చందు మొండేటి (కార్తికేయ), ఉత్తమ సంగీత దర్శకుడు - అనూప్ రూబెన్స్ (మనం),  ఉత్తమ ఛాయాగ్రాహకుడు- సాయి శ్రీరామ్‌(అలా ఎలా), ఉత్తమ కొరియోగ్రాఫర్‌ -ప్రేమ్‌ రక్షిత్‌ (నారీ నారీ, ఆగడు), ఉత్తమ ఫైట్‌మాస్టర్‌ -రామ్‌ లక్ష్మణ్ (లెజెండ్‌), ఉత్తమ బాలనటుడు -గౌతమ్‌కృష్ణ (నేనొక్కడినే)

ఉత్తమ కథా రచయిత - కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే), ఉత్తమ మాటల రచయిత- ఎం.రత్నం (లెజెండ్), ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత - రవి కుమార్ చౌదరి (పిల్లా నువ్వు లేని జీవితం), ఉత్తమ పాటల రచయిత - చైతన్య ప్రసాద్ (ఎవడెవడో పస్తుంటే, బ్రోకర్ 2), ఉత్తమ గాయకుడు - విజయ్ జేసుదాస్ (నీ కంటి చూపుల్లోకి, లెజెండ్), ఉత్తమ గాయని - చిత్ర (గోపికమ్మ చాలును, ముకుంద), ఉత్తమ ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (లెజెండ్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - రఘునాథ్ (లెజెండ్), ఉత్తమ కళా దర్శకుడు - విజయ్ క్రిష్ణ (హనుమాన్ చాలీసా), ఉత్తమ శబ్ద గ్రహకుడు - ఇ.రాధాక్రిష్ణ (కార్తికేయ), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - ఉద్ధండు (ఓరి దేవుడోయ్), ఉత్తమ మేకప్ - కృష్ణ (శనిదేవుడు), ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు - పి.రవిశంకర్ (రేసుగుర్రం), ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి - చిన్మయి (మనం), తెలుగు సినిపై ఉత్తమ పుస్తకం - తెర వెనుక తెలుగు సినిమా, నా సినిమా సెన్సార్ అయిపోయిందోచ్ (ప్రభాకర్ జైనీ), ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు - పులగం చిన్నారాయణ, ప్రత్యేక ప్రశంసా పురస్కారాలు - అవసరాల శ్రీనివాస్ (ఊహలు గుసగుసలాడే), మేకా రామక్రిష్ణ (మళ్లీ రాదోయ్ లైఫ్), కృష్ణారావు (అడవి కాచిన వెన్నెల), ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు - క‌మ‌ల్ హాసన్‌, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు- ఆర్‌.నారాయణమూర్తి,  రఘుపతి వెంకయ్య అవార్డు- కృష్ణంరాజు.

2015 
ఉత్తమ చిత్రం - బాహుబలి(బిగినింగ్‌), ద్వితీయ ఉత్తమ చిత్రం- ఎవడే సుబ్రమణ్యం, తృతీయ ఉత్తమ చిత్రం- నేను శైలజ,  ఉత్తమ నటుడు - మహేష్‌బాబు(శ్రీమంతుడు), ఉత్తమ కుటుంబ కథాచిత్రం- మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం‌- శ్రీమంతుడు, ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం - కంచె, ఉత్తమ లఘుచిత్రం - సీతావలోకనం, ఉత్తమ ద్వితీయ లఘుచిత్రం -గోదావరి పుష్కరాలు, ఉత్తమ విద్యాప్రధానమైన చిత్రం - నీరు-చెట్టు, తెలుగు సినిమాల మీద ఉత్తమ పుస్తకం - తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు, ఉత్తమ విమర్శకుడు - డాక్టర్ కంపెల్ల రవిచంద్రన్,  ఉత్తమ బాలల చిత్రం -దానవీర శూరకర్ణ, ఉత్తమ నటి - అనుష్క(సైజ్‌ జీరో), ఉత్తమ సహాయక నటుడు - పోసాని క్రిష్ణమురళి (టెంపర్), ఉత్తమ సహాయక నటి - రమ్యక్రిష్ణ (బాహుబలి), ఎస్వీ రంగారావు స్మారక పురస్కారం (ఉత్తమ సహాయక నటుడు) - అల్లు అర్జున్ (రుద్రమదేవి)   

ఉత్తమ దర్శకుడు - ఎస్ ఎస్ రాజమౌళి (బాహుబలి),ఉత్తమ హాస్యనటుడు -  వెన్నెల కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌), ఉత్తమ హాస్యనటి - స్నిగ్ధ (జత కలిసే), ఉత్తమ ప్రతినాయకుడు (రానా, బాహుబలి), ఉత్తమ బాలనటుడు - మాస్టర్ ఎన్టీఆర్ (దానవీరశూరకర్ణ), ఉత్తమ బాలనటి - బేబీ కారుణ్య (దానవీరశూరకర్ణ), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - నాగ్ ఆశ్విన్ (ఎవడే సుబ్రమణ్యం), ఉత్తమ స్క్రీన్ ప్లే - కిశోర్ తుమ్మల (నేను శైలజ), ఉత్తమ కథా రచయిత - క్రిష్ (కంచె), ఉత్తమ మాటల రచయిత - బుర్రా సాయిమాధవ్ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు), ఉత్తమ పాటల రచయిత - రామజోగయ్య శాస్త్రి (ఓ నిండు భూమి, శ్రీమంతుడు), ఉత్తమ ఛాయగ్రహకుడు - సెంథిల్ కుమార్ (బాహుబలి), ఉత్తమ సంగీత దర్శకుడు - ఎం.ఎం.కీరవాణి (బాహుబలి), ఘంటశాల స్మారక పురస్కారం (ఉత్తమ గాయకుడు) - ఎం.ఎం.కీరవాణి (బాహుబలి), ఉత్తమ గాయని - చిన్మయి (గతమా గతమా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు), ఉత్తమ మాటల రచయిత- సాయిమాధవ్‌( మళ్ళీ మళ్లీ ఇది రానిరోజు), ఉత్తమ సంగీత దర్శకుడు - ఎం.ఎం.కీరవాణి, ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు, నాగిరెడ్డి చక్రపాణి జాతీయ అవార్డు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ 

2016
ఉత్తమ చిత్రం- పెళ్లిచూపులు,  ద్వితీయ ఉత్తమ చిత్రం- అర్ధనారి, తృతీయ ఉత్తమ చిత్రం- మనలో ఒకడు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - జనతా గ్యారేజ్, ఉత్తమ కుటుంబ కథా చిత్రం - శతమానంభవతి, ఉత్తమ బాలల చిత్రం - షాను, ఉత్తమ ద్వితీయ బాలల చిత్రం - మట్టిలో మాణిక్యాలు, ఉత్తమ లఘు చిత్రం - న్యూ ఇండియా (పి.వి.నరసింహారావు), ఉత్తమ ద్వితీయ లఘు చిత్రం - డోలు సన్నాయి (ఎల్బీ శ్రీరామ్),  ఉత్తమ పుస్తకం - పసిడి తెర (పులగం చిన్నారాయణ),ఉత్తమ విమర్శకుడు - విజయ్ ప్రసాద్ వత్తి, ఉత్తమ నటుడు - జూనియర్‌ ఎన్టీఆర్‌ (జనతా గ్యారేజ్), ఉత్తమ నటి - రీతూవర్మ (పెళ్లిచూపులు), ఉత్తమ సహాయ నటుడు - మోహన్ లాల్ (జనతా గ్యారేజ్), ఉత్తమ సహాయ నటి - జయసుధ (శతమానంభవతి), ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ) - నాని (జెంటిల్ మేన్), ఉత్తమ దర్శకుడు(స్పెషల్ జ్యూరీ) - చంద్రశేఖర్ యేలేటి (మనమంతా), ఉత్తమ ద్వితీయ దర్శకుడు (స్పెషల్ జ్యూరీ) - సాగర్ చంద్ర (అప్పట్లో ఒక్కడుండేవాడు), ఉత్తమ దర్శకుడు - సతీష్ వేగేశ్న (శతమానంభవతి), ఎస్వీ రంగారావు స్మారక పురస్కారం (ఉత్తమ సహాయ నటులకు ఇచ్చే పురస్కారం) - నరేష్ (శతమానంభవతి), అల్లు రామలింగయ్య స్మారక పురస్కారం (ఉత్తమ హాస్య నటులకు ఇచ్చే పురస్కారం) - సప్తగిరి (ఎక్స్ ప్రెస్ రాజా), ఉత్తమ హాస్యనటి - ప్రగతి (కళ్యాణవైభోగమే), ఉత్తమ ప్రతినాయకుడు - ఆది పినిశెట్టి (సరైనోడు), ఉత్తమ బాలనటుడు - మైఖేల్ గాంధీ (సుప్రీమ్), ఉత్తమ బాలనటి - రైనా రావ్ (మనమంతా)

ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు - కళ్యాణక్రిష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయన), ఉత్తమ స్క్రీన్ ప్లే - రవికాంత్ పారెపు, అడివి శేష్ (క్షణం), ఉత్తమ కథ - కొరటాల శివ (జనతా గ్యారేజ్), ఉత్తమ మాటల రచయిత - అవసరాల శ్రీనివాస్ (జో అచ్యుతానంద), ఉత్తమ పాటల రచయిత - రామజోగయ్యశాస్త్రి (ప్రణామం ప్రణామం, జనతా గ్యారేజ్), ఉత్తమ ఛాయాగ్రహకుడు - సమీర్ రెడ్డి (శతమానంభవతి), ఉత్తమ సంగీత దర్శకుడు - మిక్కి జే మేయర్ (అ.ఆ), ఘంటశాల స్మారక పురస్కారం (ఉత్తమ సంగీత దర్శకుడు) - వందేమాతరం శ్రీనివాస్ (కమ్మనైన అమ్మపాట, దండకారణ్యం), ఉత్తమ గాయకురాలు - చిన్మయి (మనసంతా మేఘమై, కళ్యాణ వైభోగమే), ఉత్తమ ఎడిటర్ - నవీన్ నూలి (నాన్నకు ప్రేమతో), ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ - ఏఎస్ ప్రకాష్ (జనతా గ్యారేజ్), ఉత్తమ నృత్య దర్శకుడు - రాజు సుందరం (ప్రణామం ప్రణామం, జనతా గ్యారేజ్), ఉత్తమ శబ్దగ్రహకుడు - ఈ రాధాక్రిష్ణ (సరైనోడు), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - వి తిరుమలేశ్వరరావు (శ్రీ చిలుకూరి బాలాజీ), ఉత్తమ మేకప్ - రంజిత్ (అర్థనారి), ఉత్తమ ఫైట్ మాస్టర్ - వెంకట్ (సుప్రీం), ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు - వాసు (అర్ధనారి), ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి - లిప్సిక (ఎక్కడికి పోతావు చిన్నవాడా), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ సంస్థ - ఫైర్ ఫ్లై (సోగ్గాడే చిన్నినాయన),  ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు- రజనీకాంత్‌, బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు - బోయపాటి శ్రీనివాస్‌, రఘుపతి వెంకయ్య అవార్డు - చిరంజీవి. 2016లో ఉత్తమ జాతీయ సమైక్యతా పురస్కారం ఏ చిత్రానికి కూడా లభించలేదు.

 

Trending News