Ease of living index 2020: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో టాప్‌లో బెంగళూరు..కాకినాడ, తిరుపతి నగరాలకూ చోటు

Ease of living index 2020: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. జీవించేందుకు అనుకూల పరిస్థితుల సూచీ. ప్రతియేటా దేశంలోని వివిధ నగరాల్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంటుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో అగ్రస్థానాన్ని బెంగళూరు కైవసం చేసుకోగా..ఇతర విభాగాల్లో రెండు తెలుగు నగరాలకు చోటు దక్కింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 4, 2021, 04:25 PM IST
  • ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020 ర్యాంకుల్ని విడుదల చేసిన ప్రభుత్వం
  • మిలియన్ ప్లస్ కేటగరీలో బెంగళూరు ప్రధమ స్థానం కాగా పూణే, అహ్మదాాబాద్‌లకు తరువాతి స్థానాలు
  • మిలియన్ బిలో కేటగరీలో షిమ్లా తొలి స్థానం కాగా..కాకినాడకు నాలుగో స్థానం
Ease of living index 2020: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో టాప్‌లో బెంగళూరు..కాకినాడ, తిరుపతి నగరాలకూ చోటు

Ease of living index 2020: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. జీవించేందుకు అనుకూల పరిస్థితుల సూచీ. ప్రతియేటా దేశంలోని వివిధ నగరాల్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంటుంది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 2020లో అగ్రస్థానాన్ని బెంగళూరు కైవసం చేసుకోగా..ఇతర విభాగాల్లో రెండు తెలుగు నగరాలకు చోటు దక్కింది.

ప్రభుత్వం ప్రతియేటా విడుదల చేసే ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌(Ease of living Index 2020)లో భాగంగా 2020 సంవత్సరానికి బెంగళూరు టాప్ ప్లేస్ ( Bengaluru in top place)‌లో నిలిచింది. బెంగళూరు తరువాతి స్థానాల్లో పూణే, అహ్మదాబాద్ నగరాలున్నాయి. మిలియన్ ప్లస్ కేటగరీలో బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ నగరాలు తొలి మూడు స్థానాల్ని ఆక్రమించాయి. నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకుల్ని కేటాయిస్తుంటారు. ఇదే కేటగరీలో అంటే టాప్‌టెన్‌లో బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్, నవీ ముంబై, కోయంబత్తూర్, వడోదర, ఇండోర్, గ్రేటర్ ముంబై ఉన్నాయి.

ఇక ఒక మిలియన్‌లోపు జనాభా ఉన్న నగరాల్లో షిమ్లా ( Shimla) తొలిస్థానంలో నిలిచింది. తరువాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వస్సా, కాకినాడ( kakinada), సేలం, గాంధీనగర్, గురుగ్రామ్, దేవన్‌గిరి, తిరుచిరాపల్లి ఉన్నాయి. 2020లో జరిగిన ఈ సర్వేలో 111 నగరాలు పాల్గొన్నాయి. పట్టణాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా ఈ ర్యాంకుల్ని కేటాయిస్తున్నట్టు పీఐబీ తెలిపింది. మరోవైపు మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్‌( Municipal  performance index)ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మిలియన్ ప్లస్ కేటగరీలో ఇండోర్ టాప్‌లో ఉండగా..సూరత్, భోపాల్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మిలియన్ లోపు జనాభా ఉన్న కేటగరీలో న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ టాప్‌లో ఉండగా.. తిరుపతి ( Tirupati), గాంధీనగర్ తరువాతి స్థానాల్లో నిలిచాయి.

Also read: Ap Mlc Elections: సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న ఎమ్మెల్సీ అభ్యర్ధులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News