Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం

వైఎస్సార్ సీపీ కీలకనేత, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తల్లి బొత్స ఈశ్వరమ్మ (Botsa Satyanarayana Mother Passes Away) ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.

Last Updated : Aug 16, 2020, 08:40 AM IST
  • మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం
  • బొత్స తల్లి బొత్స ఈశ్వరమ్మ కన్నుమూత
  • విశాఖలోని ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన ఈశ్వరమ్మ
Botsa Satyanarayana: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంట విషాదం

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana Mother Passes Away) ఇంట విషాదం చోటుచేసుకుంది. మంత్రి బొత్స తల్లి బొత్స ఈశ్వరమ్మ(84) ఆదివారం వేకువజామున కన్నుమూశారు. వయసురీత్యా గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈశ్వరమ్మ విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూనే బొత్స ఈశ్వరమ్మ తుదిశ్వాస (Botsa Eswaramma Dies) విడిచారు. Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది

బొత్స ఈశ్వరమ్మకు మొత్తం పదకొండు మంది సంతానం. ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా, అందులో మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు సైతం రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారు. నేటి మధ్యాహ్నం (ఆదివారం) విజయనగరంలోని స్వర్గధామంలో బొత్స ఈశ్వరమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. Heavy Rain Alert: మరో మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x