Heavy Rain Alert: మరో మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains 0 పడవచ్చని తెలుస్తోంది.

Last Updated : Aug 15, 2020, 06:17 PM IST
Heavy Rain Alert: మరో మూడ్రోజులు ఏపీలో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో మరో మూడ్రోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే మూడ్రోజుల్నించి వర్షాలతో తడిసిముద్దయిన ఏపీకు ..మరో మూడ్రోజులు వర్షాలు తప్పేట్లు లేవు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ( Heavy rains ) పడవచ్చని తెలుస్తోంది.

ఉత్తర కోస్తా ఒరిస్సా ( North coastal odissa ), వాయువ్య బంగాళాఖాతం ( Bay of Bengal ), గ్యాంగ్ టెక్ పశ్చిమబెంగాల్ ( West Bengal ) పరిసరాల్లో ఉన్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ ( IMD ) తెలిపింది. మరోవైపు 9.5 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఈ నెల 19న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికార్లు చెబుతున్నారు. 

ఈ నేపధ్యంలో రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు ( Heavy rains for 3 more days ) వర్షాలు కురిసే అవకాశముందని  ఐఎండీ తెలిపింది. ఆదివారం నాడు కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు  కురిసే అవకాశముంది. అటు విశాఖపట్నంలో భారీ వర్షం పడవచ్చు.మిగిలిన ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చు. దక్షిణ కోస్తాంధ్రలో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ ప్రాంతంలో కూడా కొన్నిచోట్ల భారీ వర్షాలు..మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. Also read: Godavari Flood: ధవిళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Trending News