రాజ్ భవన్ సెక్యురిటీ సిబ్బందికి COVID-19

ఏపీ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న భద్రతా సిబ్బందిలో 15 మందికి కరోనావైరస్ ( Coronavirus) సోకినట్టు తెలుస్తోంది. దీంతో రాజ్ భవన్ వద్ద కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది.

Last Updated : Jul 29, 2020, 11:38 PM IST
రాజ్ భవన్ సెక్యురిటీ సిబ్బందికి COVID-19

అమరావతి: ఏపీ రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న భద్రతా సిబ్బందిలో 15 మందికి కరోనావైరస్ ( Coronavirus) సోకినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన పాత భద్రతా సిబ్బందిని క్వారంటైన్‌కి పంపిస్తూ వారి స్థానంలో సుమారు 72 మంది కొత్త సిబ్బందిని నియమించినట్టు సమాచారం. దీంతో రాజ్ భవన్ వద్ద కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. Also read: SS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్

ఇదిలావుంటే, ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 70,584 క‌రోనా శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా ( COVID-19 tests) వీటిలో 10,093 మందికి పాజిటివ్‌ అని తేలింది. మరోవైపు అదే సమయంలో కరోనా కారణంగా 65 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో కరోనావైరస్ సోకిన వారి మొత్తం సంఖ్య 1,20,390 కి చేరుకోగా.. కరోనాతో మొత్తం 1,213 మంది ప్రాణాలు కోల్పోయారు. Also read: Smoking vs COVID-19: సిగరెట్ తాగే అలవాటుందా ? ఐతే కరోనాతో కష్టమే!

Trending News