SS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్

ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) కొవిడ్-19 బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Last Updated : Jul 29, 2020, 10:25 PM IST
SS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్

హైదరాబాద్‌: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (SS Rajamouli) కొవిడ్-19 బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనతో పాటు తన కుటుంబసభ్యులకు కొంత జ్వరం వచ్చినట్టుగా అనిపించిందని.. ఆ తర్వాత దానంతట అదే తగ్గినప్పటికీ.. మేము కరోనా పరీక్షలు ( COVID-19 tests) చేయించుకున్నామని.. ఇవాళ ఫలితాల్లో కొంత పాజిటివ్ అని తేలిందని రాజమౌళి ట్వీట్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులం అందరం ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ( Home quarantine) ఉన్నామని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. Also readSmoking vs COVID-19: సిగరెట్ తాగే అలవాటుందా ? ఐతే కరోనాతో కష్టమే!

 

Trending News