Raksha Bandhan 2022: ఏపీ సీఎం జగన్‌ నివాసంలో సందడి.. రాఖీలు కట్టిన మహిళా నేతలు

Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎ జగన్ కు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు.

Written by - Srisailam | Last Updated : Aug 11, 2022, 12:52 PM IST
Raksha Bandhan 2022:  ఏపీ సీఎం జగన్‌ నివాసంలో సందడి..  రాఖీలు కట్టిన మహిళా నేతలు

Raksha Bandhan 2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోరెడ్డి నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎ జగన్ కు పలువురు మంత్రులు, వైసీపీ నేతలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు చెప్పారు. హోంశాఖ మంత్రి  తానేటి వనిత, హెల్త్ మినిస్టర్ విడదల రజని, ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్‌ అక్రమాని విజయనిర్మల తదితరులు సీఎం నివాసానికి వచ్చి జగన్ కు రాఖీలు కట్టారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి ప్రతినిధులు రాజయోగిని బ్రహ్మకుమారి శాంత దీదీ జీ, సిస్టర్స్‌ పద్మజ, మానస.. సీఎం జగన్ కు రాఖీలు కట్టారు.

 రక్షా బంధన్ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు సీఎం వైఎస్ జగన్. రాఖీ పౌర్ణమి  ఆత్మీయతల, అనురాగాల పండుగ అన్నారు.  ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా మహిళలకు మంచి చేసే విషయంలో దేశంలోనే ఏపీ ముందు ఉందన్నారు. అక్కచెల్లెమ్మలందరి చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు జగన్ సందేశం ఇచ్చారు.

Read also: Shilpa Shetty: షూటింగ్లో ప్రమాదం.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి!

Read also: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర! హైదరాబాద్‌లో నేటి రేట్లు ఇవే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News