APECET 2023 Results: ఏపీఈసెట్ 2023 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లోకి నేరుగా రెండవ సంవత్సరంలో అడ్మిషన్లు ఇస్తారు. దీనికోసం నిర్వహించేదే ఏపీఈసెట్ 2023 పరీక్ష. ఈ ఫలితాలు కాస్సేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నేరుగా చూడవచ్చు.
రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నేరుగా రెండవ సంవత్సరంలో అడ్మిషన్లకు నిర్వహించే ఈపీఈసెట్ 2023 పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. జూన్ 20వ తేదీన ఏపీలో 103 పరీక్షా కేంద్రాలు, హైదరాబాద్‌లో 2 పరీక్షా కేంద్రాల్లో ఏపీఈసెట్ 2023 పరీక్ష నిర్వహించారు. మొత్తం 38,255 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 28,640 మంది బాలురు ఉంటే..9,615 మంది బాలికలున్నారు. పాలిటెక్నిక్, బీఎస్సీ మేథ్స్ ఉత్తీర్ణులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నేరుగా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లోని రెండవ సంవత్సరంలో చేరవచ్చు. జూన్ 20 తేదీన ప్రవేశ పరీక్ష జరగగా జూన్ 23న కీ విడుదలైంది. ఇవాళ జూలై 2వ తేదీన ర్యాంకులు, మార్కులు విడుదలయ్యాయి. ఏపీఈసెట్ 2023 కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై రెండవ వారం నుంచి ప్రారంభం కావచ్చు. కౌన్సిలింగ్‌కు ముందు అభ్యర్ధులు తప్పనిసరిగా విద్యార్హత సర్టిఫికేట్లు, ఆదాయ ధృవీకరణ పత్రం, కేటగరీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ సిద్ధంగా ఉంచుకోవాలి.
జేఎన్టీయూ కాకినాడ నిర్వహించిన ఏపీ ఈసెట్ 2023 ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా ఇంజనీరింగ్, బీ ఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలో ప్రవేశాలుంటాయి. వచ్చిన ర్యాంకు, మెరిట్ ఆధారంగా ఏపీఈసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అడ్మిషన్లు ఉంటాయి.
Also read: AP Weather Forecast: రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook