ST Reservations: గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంపు.. ఎస్టీలకు కేసీఆర్‌ దసరా గిప్ట్..

Telangana Govt: గిరిజనులకు కేసీఆర్ దసరా గిప్ట్ ఇచ్చారు. ఎస్టీల రిజర్వేషన్ ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 06:20 AM IST
  • ఎస్టీలకు కేసీఆర్‌ దసరా కానుక
  • గిరిజన కోటా 10 శాతం పెంపు
  • తక్షణమే అమల్లోకి
ST Reservations:  గిరిజన రిజర్వేషన్లు 10 శాతం పెంపు.. ఎస్టీలకు కేసీఆర్‌ దసరా గిప్ట్..

Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ రాష్ట్రప్రభుత్వం (Telangana government) శుక్రవారం అర్ధరాత్రి జీవో నంబర్ 33 జారీ చేసింది. ఈ కొత్త రిజర్వేషన్లు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో ఎస్టీలకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది.  దీంతో రాష్ట్రంలో విద్య, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరినట్లయింది. 

ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌ 17వ తేదీన ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించినప్పుడు కూడా దీనిపై మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో సైతం దీనిపై హామీ ఇవ్వడం జరిగింది. 

రాష్ట్రంలో రిజర్వేషన్ల పెంపుపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ కూడా వేశారు. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్‌ 15న రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏళ్లు గడుస్తున్నా... కేంద్రం సాగదీత ధోరణి అవలంభిస్తుడంతో స్వయంగా రిజర్వేషన్లు పెంచుతూ సీఎం కేసీఆర్ ఈ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్తూనే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దీనికి అవకాశం కల్పించింది. తమిళనాడు రాష్ట్రంలో సైతం 69శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. 

Also Read: CM Kcr: యాదాద్రిపై ఆధ్యాత్మిక శోభ విలసిల్లాలి..పనులపై సీఎం కేసీఆర్ ఆరా..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News