APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. బస్టాండ్లలో ఫ్రీ ఇంటర్నెట్‌

APSRTC Free Internet: ఏపీఎస్ఆర్టీసీ నుంచి మరో గుడ్‌న్యూస్ వచ్చింది. ఇక నుంచి బస్టాండ్లలో ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా స్పెషల్ బస్సులు నడపనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2022, 08:39 AM IST
APSRTC: ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త.. బస్టాండ్లలో ఫ్రీ ఇంటర్నెట్‌

APSRTC Free Internet: ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది.  
ఇక నుంచి బస్టాండ్‌లలో ఫ్రీ ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన వసతులతో పాటు.. ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి తెలిపారు. విజయవాడలో జరిగిన ఆర్టీసీ పాలకమండలి సమావేశం పలు కీలక అంశాలపై చర్చించారు. 

బస్టాండ్లలో ఫ్రీ ఇంటర్నెట్‌తో పాటు ఈ ఏడాదిలో రెండుసార్లు పెంచిన ఛార్జీలకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. అదేవిధంగా అద్దెకు తీసుకున్న బస్సులు, కొత్తగా బోర్డు సభ్యుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలాలు లీజుపై అధికారులు తీసుకున్న నిర్ణయాలకు సభ్యులు ఒకే చెప్పారు. ఈ సమావేశానికి ఎండీ ద్వారకా తిరుమలరావు, జోనల్‌ ఛైర్మన్లు, అధికారులు హాజరయ్యారు. 

మరోవైపు సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. http://apsrtconline.in వెబ్‌సైట్‌‌ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని కోరారు. రౌండ్ ట్రిప్ (రాను, పోను) బుక్ చేసుకుంటే టికెట్ ఛార్జీలపై పది శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చన్నారు.  

అదేవిధంగా ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించారు. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

ఇక ఇటీవలె ఏపీలో నాన్ ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆర్టీసీ. ఈ బస్సులను స్టార్ లైనర్ పేరుతో నడుపుతున్నారు. ఈ బస్సులో 2+1 స్లీపర్ కోచ్, 30 కుషన్ సాఫ్ట్ బెర్త్‌‌లు ఉన్నాయి. ఇందులో ఛార్జింగ్ పోర్ట్స్, రీడింగ్ లాంప్స్, లగేజీ ర్యాక్స్, ఆడియో కోచ్‌ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని జిల్లాల్లో ఈ బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి.  

Also Read: Bangladesh Formation: చరిత్రలో స్పెషల్ డే.. మన సైన్యం దెబ్బకు తోకమూడిచిన పాక్.. బంగ్లాదేశ్‌ ఏర్పడిన కథ   

Also Read: JEE Mains 2023: జేఈఈ మెయిన్స్ నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News