Badvel Bypoll: తెలుగు రాష్ట్రాల్లో బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నికల శంఖారావం మోగింది. హుజూరాబాద్ ఎన్నిక పోటాపోటీగా ఉండగా..బద్వేలు ఉపఎన్నిక ఏకగ్రీవమయ్యే మార్గాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే
ఏపీలో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ (Huzurabad Bypoll)నియోజకవర్గాల ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా, అక్టోబర్ 8వ తేదీ చివరితేదీ నిర్ణయించారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన రామసుబ్బయ్య హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
తెలంగాణ హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోటాపోటీగా ఉండనుంది. హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా అనంతరం మంత్రిగా చేసిన ఈటెల రాజేందర్(Eetela Rajender)టీఆర్ఎస్ పార్టీకు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. హుజూరాబాద్‌లో ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికకు(Badvel Bypoll) సంబంధించి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(ysr Congress party)ఇప్పటికే దివంగత ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ సుధను అభ్యర్ధిగా బరిలో నిలిపింది. ఇక బీజేపీ-జనసేన కూటమి పోటీ విషయంలో స్పష్టత రాలేదు. తెలుగుదేశం పార్టీ(Telugu desam)మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో అత్యవసర సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ-జనసేన కూడా పోటీ నుంచి తప్పుకుంటే ఉపఎన్నిక ఏకగ్రీవం కానుంది.
Also read: National Digital Health Mission 2021: ఇక ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డు, ఎలా పొందాలంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి