Badvel Bypoll: బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల, అమల్లో వచ్చిన కోడ్

Badvel Bypoll: తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడటంతో ఆ రెండు జిల్లాల్లోనూ కోడ్ అమల్లోకొచ్చింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 1, 2021, 03:33 PM IST
  • బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల
  • నేటి నుంచి రెండు నియోజకవర్గాల జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో
  • అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్, ప్రారంభమైన నామినేషన్ల పర్వం
Badvel Bypoll: బద్వేలు, హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల, అమల్లో వచ్చిన కోడ్

Badvel Bypoll: తెలుగు రాష్ట్రాల ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వెలువడటంతో ఆ రెండు జిల్లాల్లోనూ కోడ్ అమల్లోకొచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ప్రారంభమైంది. రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల నోటిఫికేషన్(Bypolls Notification) వెలువడింది. ఏపీలో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం, తెలంగాణలో హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలు అక్టోబర్ 30న జరగనున్నాయి. బద్వేలు అధికార పార్టీ ఎమ్మెల్యే హఠాన్మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. అటు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్(Eetela Rajender)రాజీనామాతో ఉపఎన్నిక జరుగుతోంది. 

బద్వేలు, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల(Huzurabad Bypoll) ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. బద్వేలు ఉపఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ నియమితులయ్యారు. నోటిఫికేషన్ వెలువడటంతో కడప జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చింది. అక్టోబర్ 8వ తేదీన నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీగా ఉంది. అక్టోబర్ 30న పోలింగ్ ఉంటుంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోవిడ్ నిబంధనల మేరకు బహిరంగసభకు వేయికి మించి అనుమతి లేదు. బద్వేలు అసెంబ్లీ (Badvel Bypoll)నియోజకవర్గ పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు, 2 లక్షల 12 వేల 739 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1 లక్షా 6 వేల 650 మంది కాగా, మహిళా ఓటర్లు 1 లక్షా 6 వేల 69 మంది ఉన్నారు. 2011 నాటి ఓటర్ల జాబితా ఇది. కొత్త జాబితా త్వరలో వెలువడనుంది. 

Also read: RBI New Rules: ఈఎంఐ వంటి చెల్లింపులకు ఇకపై అదనపు ధృవీకరణ అవసరం, ఇవాళ్టి నుంచే అమలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News