సంగీత విద్వాంసులు సీతారామశర్మ ఇకలేరు...!

భాగవతుల సీతారామశర్మ (81) ఆదివారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఈయనొక ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు. 

Last Updated : Dec 11, 2017, 06:16 PM IST
సంగీత విద్వాంసులు సీతారామశర్మ ఇకలేరు...!

భాగవతుల సీతారామశర్మ (81) ఆదివారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఈయనొక ప్రముఖ సంగీత విద్వాంసులు, గాయకులు. 

కృష్ణాజిల్లా కూచిపూడిలో 1936న సీతారామశర్మ జన్మించారు. విజయవాడలో ప్రసిద్ధ నేలి శ్రీరామశర్మ, టి.ఆర్. సుబ్రహ్మణ్యం వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత1985లో సొంతంగా ' కళాపీఠం స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్ ఇండియా' పేరిట ఇన్స్టిట్యూట్ స్థాపించారు. ఠాకూర్ అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి టిటికే మెమోరియల్ అవార్డులు అందుకున్నారు. కంచి కామకోఠి పీఠానికి ఆస్థాన విద్వాంసునిగా పనిచేశారు.

Trending News