BJP List: బీజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. సీనియర్లకు షాక్‌.. ఫిరాయింపుదారులకు ఛాన్స్

BJP Candidates List For AP Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కాషాయ పార్టీ తాజాగా ఏపీ అసెంబ్లీకి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 31, 2024, 10:36 PM IST
BJP List: బీజేపీ ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా.. సీనియర్లకు షాక్‌.. ఫిరాయింపుదారులకు ఛాన్స్

BJP Candidates in AP Assembly Elections: పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించిన 10 అసెంబ్లీ స్థానాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థులను ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ ఈ మేరకు రాజకీయ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తమకు కేటాయించిన 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. అసెంబ్లీ స్థానాలకు పార్టీలోని సీనియర్‌ నాయకులకు అవకాశం కల్పించింది. వారిలో కేంద్ర మంత్రులు, మాజీ మంత్రులకు చోటు లభించింది.

Also Read: Kodali Nani: జూన్‌ 4 తర్వాత ఏపీలో చంద్రబాబు కనిపించడు: కొడాలి నాని జోస్యం

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

  1. ఎచ్చెర్ల: ఎన్‌.ఈశ్వర్‌రావు
  2. విశాఖ నార్త్‌ : పి.విష్ణుకుమార్‌రాజు
  3. అరకు : పంగి రాజారావు
  4. అనపర్తి : ఎం శివకృష్ణంరాజు
  5. కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
  6. విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
  7. బద్వేల్‌ : బొజ్జ రోషన్న
  8. జమ్మలమడుగు : సీ ఆదినారాయణరెడ్డి
  9. ఆదోని : పీవీ పార్థసారథి
  10. ధర్మవరం : వై సత్యకుమార్‌

Also Read: Pawan Kalyan: జనసేనకు పవన్‌ కల్యాణ్‌ భారీ విరాళం.. ఇకపై ఏపీలో రణరంగమే

పార్టీన మారిన తెల్లారే..
హిందూపురం పార్లమెంట్‌ స్థానం టికెట్‌ ఆశించిన పార్టీ సీనియర్‌ నాయకుడు వై సత్యకుమార్‌కు బీజేపీ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడం ఆశ్చర్యకరం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు స్థానం దక్కింది. జమ్మలమడుగుకు పార్టీ సీనియర్‌ నాయకుడు ఆదినారాయణ రెడ్డి టికెట్‌ ప్రకటించగా.. మాజీ అధ్యక్షుడు విష్ణుకుమార్‌ రాజుకు విశాఖ నార్త్‌ను కేటాయించారు. ఇక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి పార్టీలో చేరిన మరుసటి రోజే రోషన్నకు టికెట్‌ లభించడం గమనార్హం.

సీనియర్లకు మొండిచేయి
టికెట్ల కేటాయింపులో సీనియర్లకు మొండిచేయి లభించడంతో పార్టీలో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు టికెట్‌ దక్కకపోవడం గమనార్హం. పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సురేశ్‌కు టికెట్‌ లభించలేదు. ఇక సీనియర్‌ నాయకులకు నాగోతు రమేశ్‌ నాయుడు, వల్లూరి జయప్రకాశ్‌, వరదాపురం తదితరులకు టికెట్లు లభించకపోవడంతో ఆయా వర్గాలు అసంతృప్తికి గురయ్యాయి. త్వరలోనే వారు తమ రాజకీయ భవిష్యత్‌ ప్రకటించే అవకాశం ఉంది. కాగా పొత్తులో భాగంగా కేటాయించిన ఆరు ఎంపీ స్థానాలకు ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అరకు-కొత్తపల్లి గీత, అనకాపల్లి-సీఎం రమేశ్‌, రాజమహేంద్రవరం-పురందేశ్వరి, నర్సాపురం-భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి- వరప్రసాద రావు, రాజంపేట-కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News