హైదరాబాద్: నిర్మాణ రంగంలో ఉన్న వారికి, గృహనిర్మాణాలు చేపట్టాలకుంటున్న వారికి తాజాగా సిమెంట్ ధరల రూపంలో షాక్ తగిలింది. సిమెంట్ ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. బ్రాండ్, గ్రేడ్‌ని బట్టి బస్తా సిమెంట్ ధర ఏకంగా రూ.70 నుంచి రూ.100 మధ్య పెరిగింది. దీంతో బ్రాండ్ వ్యాల్యూ వున్న సిమెంట్ ధరలు బస్తాకు రూ.300పై చిలుకే పలుకుతోంది. పెరిగిన సిమెంట్ ధరలతో తమ నిర్మాణాల అంచనా వ్యయం పెరుగుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇదిలావుంటే, సిమెంట్ ధరలను పెంచిన తయారీదారులు.. ప్రస్తుతం ఉత్పత్తిని కూడా తగ్గించినట్టు తెలుస్తోంది. దీంతో మార్కెట్‌లో వున్న సిమెంట్‌పైనే ఆధారపడక తప్పదని వినియోగదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.