పోలవరం విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్రం ఝలక్

Last Updated : Nov 8, 2017, 11:39 AM IST
పోలవరం విషయంలో ఏపీ సర్కార్‌కు కేంద్రం ఝలక్

పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కాఫర్ డ్యాంను నిర్మించతలపెట్టిన విషయం తెలిసిందే. ఆయితే ఈ డ్యాంకు సంబంధించిన పనులను తక్షణం నిలుపుదల చేయాలంటూ ఏపీ సర్కార్ కేంద్ర జలవనరుల శాఖ లేఖ రాసింది. అసలు ఆ డ్యాం అవసరం ఉందో లేదో తేల్చాలని..ఇందుకు నిపుణులతో కూడిన కమిటీ వేయబోతున్నామని పేర్కొంది. ఈ కమిటీ పోలవరం సందర్శించి అధ్యయనం చేసి నివేదిక అందించిన తర్వాతే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ..అప్పటి వరకు డ్యాం విషయంలో ముందుకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఒక్క కాఫర్ డ్యాం తప్పితే మిగిలిన డ్యాంల నిర్మాణ పనులు యథతథంగా కొనసాగించవచ్చని పేర్కొంది. కేంద్రం ఆదేశాలతో పోలవరం చీఫ్ ఇంజినీర్ ..పోలవరం కాఫర్ డ్యాం పనులు నిలుపుదల చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్నపప్పటికీ తమ నిర్ణయాలకు ఇలా అడ్డుచెప్పడం సరికాదని టీడీపీ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Trending News