క్రిస్మస్ పర్వదినాన్ని పుసర్కరించుకొని ఏపీ సీఎ చంద్రబాబు క్రైస్తవులకు వరాలు జల్లు కురిపించారు. విజయవాడలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు క్రైస్తవ వర్గానికి వరాల జల్లు కురిపించారు. తెల్లకార్డు దారులకు క్రిస్మస్ కానుకలు అందజేస్తున్నామన్నారు. గుంటూరులో క్రైస్తవ భవనం నిర్మిస్తున్నామన్నారు. బసలికా చర్చికి రూ.1.5 కోట్లను గ్రాంటుగా ఇచ్చి అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.100 కోట్లను కేటాయించనున్నట్టు వివరించారు. అలాగే దళిత క్రిస్టియన్లందరికీ ‘ఎస్సీ’ హోదా కల్పించే వరకూ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మదర్ థెరిస్సా సేవలను గుర్తు చేసుకున్న చంద్రబాబు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మతపెద్దలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మానవతామూర్తి మదర్ థెరిస్సా సేవలను గుర్తు చేసుకున్నారు . చరిత్ర ఉన్నంత వరకూ ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చంద్రబాబు కొనియాడారు. క్రైస్తవులు సేవకు మారుపేరు అని కొనియాడారు. కులమతాలకు అతీతంగా మిషనరీ పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారు ఈ రోజు ఉన్నత పదవుల్లో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రాబు గుర్తు చేశారు. కాగా ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బోండా ఉమ, కలెక్టర్ లక్ష్మీకాంతం , క్రైస్తవ మతపెద్దలు తదితరులు హాజరయ్యారు.