భావోద్వేగానికి లోనైన బర్త్ డే బాబు; తెలుగు నేలపై పుట్టడం అదృష్టం

ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు  

Updated: Apr 20, 2019, 06:16 PM IST
భావోద్వేగానికి లోనైన బర్త్ డే బాబు; తెలుగు నేలపై పుట్టడం అదృష్టం

ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబు తన 69వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో జరిగిన ఈ వేడుకలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్ తో సహా పలువురు ప్రముఖులు, సహా వివిధ పార్టీలకు చంద్రబాబుకు విష్ చేశారు. 

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగాపై చంద్రబాబు ఉద్వేగానికి లోనయ్యారు. తెలుగు గడ్డపై పుట్టడం తన అదృష్టం భావిస్తున్నానని చెప్పిన బాబు..తెలుగు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించటం ఎన్నో జన్మల పుణ్యఫలం అని పేర్కొన్నారు. ఏళ్ల నుంచి ప్రజలు చూపిస్తున్న అభిమానం, ఆదరణ, వాత్సల్యం, ఇవన్నీ తన శక్తిని, ఉత్సాహాన్ని పదిరెట్లు చేసి తన కార్యసాధనకు మరింత ప్రేరేపించాయని చంద్రబాబు ట్విటర్‌లో పేర్కొన్నారు