Jagapathi Babu: రేవతి కుటుంబాన్ని అందుకే కలిశా.. సంచలన వీడియో విడుదల చేసిన జగపతి బాబు.. ఏమన్నారంటే..?

Pushpa 2 movie stampede: అల్లు అర్జున్ కు పుష్ప2 మూవీ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, నటుడు జగపతిబాబు సంచలన వీడియో విడుదల చేశారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 22, 2024, 07:40 PM IST
  • శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించిన జగపతి బాబు..
  • క్లారీటీ ఇస్తు వీడియో రిలీజ్..
Jagapathi Babu: రేవతి కుటుంబాన్ని అందుకే కలిశా.. సంచలన వీడియో విడుదల చేసిన జగపతి బాబు.. ఏమన్నారంటే..?

Jagapathi babu visits sritej in the hospital: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో అనేక రికార్డులను తిరగరాస్తుంది. ఇప్పటికే ఈ మూవీకి జనాలనుంచి ఒక రేంజ్ క్రేజ్ లో వస్తుందని చెప్పుకొవచ్చు. అయితే.. ఈ సినిమా మాత్రం  ప్రస్తుతంవివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు.  సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ఏకీపారేశారు. అల్లు అర్జున్ వల్లే ... ఇంతటి నష్టం వాటిల్లిందన్నారు. ఒక నిండు ప్రాణం పోయిందని.. మరో ప్రాణం వెంటి లేటర్ మీద.. కొట్టు మిట్టాడుతుందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రవర్తన పట్ల తీవ్ర వివాదం చెలరేగుతుందని చెప్పుకొవచ్చు.

 

పోలీసులు.. డిసెంబరు 4న చెప్పిన కూడా బన్నీ పట్టించుకోలేదని అన్నారు. అంతేకాకుండా.. తమ వాహానం రూఫ్ మీద నిలబడి.. మరీ అభిమానులకు అభివాదం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు.. డీజీపీ.. పలువురు పోలీసులు కూడా అల్లు అర్జున్ చేసిన తప్పుల్ని ఆధారాలతో సహా వీడియోల రూపంలో విడుదల చేశారు. అయితే..  అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల కాగానే.. సినిమా ఇండస్ట్రీ అంతా కట్ట కట్టుకుని అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారని.. ఒక్కరైన.. రేవతి కుటుంబాన్ని పరామర్శించారా.. అని సీఎం రేవంత్ ఇండస్ట్రీ వాళ్లను ఏకీపారేశారు.

ఈ క్రమంలో తాజాగా..దీనిపై సీనియర్ నటుడు జగపతి బాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు పుష్ప2 మూవీ తొక్కిసలాట జరిగిందని తెలవగానే చాలా ఎమోషలన్ అయినట్లు చెప్పారు. అప్పటికే వేరే ఊరిలో ఉన్నానని.. అక్కడి నుంచి రాగానే.. ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను చూసివచ్చానని, అతని తండ్రి, కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. కానీ పబ్లిసిటీ చేసుకోలేదన్నారు.  ఈ ఘటనలో ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిదన్నారు. 

Read more: Allu Arjun: అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్.. రాళ్లదాడి.. వీడియో వైరల్..

దేవుడి దయవల్ల పిల్లవాడు.. తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే.. సీఎం రేవంత్ ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడ వెళ్లలేదని అసెంబ్లీలో అన్న తర్వాత.. జగపతి బాబుఈ వీడియో రిలీజ్ చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News