Cruise Ship: వైజాగ్‌ నుంచి చెన్నై వరకు సముద్ర ప్రయాణం, మరిచిపోలేని అనుభూతి..!

Cruise Ship: సముద్రంలో ఓ మూడు నాలుగు రోజులు హాయిగా విహరించాలని ఉందా..? ఫ్యామిలీతో కలిసి సరదాగా గడపాలనుకునేవారికి సువర్ణ అవకాశం కల్పిస్తోంది విశాఖ నౌకాశ్రయం. జూన్‌ 8వ తేదీన తొలి విహారనౌక సర్వీస్‌ మొదలవుతుంది. ఈ నౌక వైజాగ్‌ నుంచి పుదుచ్చేరి, చెన్నై మీదుగా తిరిగి వైజాగ్‌ చేరుకుంటుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 08:41 AM IST
  • సముద్రంలో విహారించాలనుకునేవారికి విశాఖ నౌకాశ్రయం శుభవార్త
  • వైజాగ్‌ నుంచి పుదుచ్చేరి, చెన్నైకి విహారయాత్ర
  • మూడు రాత్రులు సముద్రంలోనే ప్రయాణం
Cruise Ship: వైజాగ్‌ నుంచి చెన్నై వరకు సముద్ర ప్రయాణం, మరిచిపోలేని అనుభూతి..!

Cruise Ship: విశాఖపట్నం వాసులను ఎన్నో ఎండ్లుగా ఊరిస్తున్న విహారనౌకల సదుపాయం రానేవచ్చింది. బయట ప్రపంచంతో సంబంధంలేకుండా హాయిగా మూడు నాలుగు రోజుల పాటు సముద్రంలో విహరించాలనుకునేవారికి విశాఖ నౌకాశ్రయం శుభవార్త చెప్పింది. ఇందుకోసం మూడు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంప్రెస్‌ పేరుగల నౌక వైజాగ్‌ నుంచి పుదుచ్చేరి మీదుగా చెన్నై వెళ్లి తిరిగి విశాఖకు చేరుకుంటుంది. ఈ సర్వీసులు జూన్‌ 8న ప్రారంభం అవుతాయి. ఆ తర్వాత జూన్‌ 15, 22 తేదీల్లోనూ ఈ సర్వీస్‌ అందుబాటులో ఉండనుంది. ఎంప్రెస్‌ నౌకలో విహరించాలనుకునేవారు.. ఎంచుకునే సర్వీసును బట్టి ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నౌకను నడపడం కోసం ముంబైకి చెందిన జెఎం భక్షి సంస్థ ప్రతినిధులు నౌకశ్రయ అధికారులను సంప్రదించారు. దానికి అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఈ నౌకలో 1500 నుంచి 1800 మంది వరకు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి చెన్నై వరకు విహరించేందుకు టికెట్లు విక్రయిస్తున్నారు.

జూన్‌ 8వ తేదీన ఉదయమే ఎంప్రెస్‌ క్రూజ్‌ విశాఖపట్నానికి చేరుకుంటది. అదే రోజు రాత్రి 8 గంటలకు ప్రయాణికులతో తొలి సర్వీస్‌ బయలుదేరి తొమ్మిదో తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10వ తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడుగంటల వరకు పర్యటించవచ్చు. ఆయా ఏర్పాట్లు కూడా ఆ సంస్థే చేస్తుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు చెన్నైకు చేరుకుంటుంది. అక్కడి నుంచి  మళ్లీ తిరిగి వైజాగ్‌ కు వస్తుంది. ఈ ఎంప్రెస్‌ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. దీంతో పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. కస్టమ్స్‌ తనిఖీలు ఉండవు. క్రూజ్‌ లో సాధారణ గదులకు దాదాపుగా 50 వేలు, ఓసియన్‌ వ్యూ గదులకు 61 వేలు, మినీ సూట్‌ కు లక్షా 10 వేల వరకు ఛార్జ్‌ చేయనున్నారు. ఇక సూట్‌ రూంలకు దాదాపుగా రెండు లక్షల వరకు వసూలు చేస్తారు. గతంలోనూ వైజాగ్‌ కు కొన్ని క్రూజ్‌ షిప్‌ లు వచ్చినప్పటికీ రెగ్యులర్‌ మాత్రం ఎలాంటి సర్వీసులు అందుబాటులో లేవు.

ఇక సముద్రంలో మూడు రాత్రులు, నాలుగు రోజులు గడపాలనుకునేవారికి ఇదో అద్భుత అవకాశం. ఎంప్రెస్‌ నౌక్‌ లో ఎన్నో అబ్బురపరిచే సదుపాయాలు ఉన్నాయి. ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఫిట్‌ నెస్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. కాసినో, లిక్కర్‌, సర్వీసులకు అదనపు ఛార్జీలు ఉంటాయి. భారత సాగరతీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారనివిశాఖ నౌకాశ్రయ అధికారులు తెలిపారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని స్పష్టం చేశారు.

టికెట్లు బుక్‌ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

https://www.cordeliacruises.com/cruise-routes

Also Read: TDP-JANASENA: బీజేపీతో కటీఫ్.. టీడీపీతో డీల్! జనసేన పోటీ చేసి సీట్లు ఖరారు?

Also Read: Telangana Governer: అప్పులయ్యాయని రాజభవనకు లెటర్.. రూ. 25 వేలు సాయం చేసిన గవర్నర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News