Telangana Governer: అప్పులయ్యాయని రాజభవనకు లెటర్.. రూ. 25 వేలు సాయం చేసిన గవర్నర్

Telangana Governer: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఇటీవల కాలంలో జనానికి బాగా దగ్గరవుతున్నారు. రాజ్ భవన్ కంటే ప్రజా క్షేత్రంలో తిరగడానికే ఇష్టపడుతున్నాు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేదల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాళ్లతో మమేకం అవుతూ.. తన పరిధిలో సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 28, 2022, 07:08 AM IST
  • ప్రజా సమస్యలపై గవర్నర్ ఫోకస్
  • అప్పులయ్యాయని రాజ్ భవన్ కు లెటర్
  • 25 వేల సాయం చేసిన తమిళి సై
Telangana Governer: అప్పులయ్యాయని రాజభవనకు లెటర్.. రూ. 25 వేలు సాయం చేసిన గవర్నర్

Telangana Governer: తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఇటీవల కాలంలో జనానికి బాగా దగ్గరవుతున్నారు. రాజ్ భవన్ కంటే ప్రజా క్షేత్రంలో తిరగడానికే ఇష్టపడుతున్నాు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేదల కష్టాలు తెలుసుకుంటున్నారు. వాళ్లతో మమేకం అవుతూ.. తన పరిధిలో సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత కాలంగా తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్ తో గవర్నర్ కు గ్యాప్ పెరిగింది. తనను అవమానిస్తున్నారని ఓపెన్ గానే తమిళి సై సౌందరరాజన్ ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై కోపంగా ఉన్న గవర్నర్.. తనదైన శైలిలో దూకుడు పెంచారు. రాజ్ భవన్ ను ప్రజలకు మరింత చేరువ చేసేలా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంటుంది.

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన యువకుడికి రాజ్ భవన్ నుంచి ఆర్థిక సహాయం అందింది. గ్రామానికి చెందిన మందుల రామ్మూర్తి నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అయినా కూలీ పనులకు వెళ్తూ ఎంతో కష్టపడి ఇంటర్ వరకు చదివాడు. ఆర్థిక స్థోమత సరిగ్గా లేక చదువు మధ్యలోనే ఆపేశాడు. కుటుంబాన్ని చూసుకోవడం, ఇంటి బాధ్యతలు మీద పడడంతో అప్పులు చేయాల్సి వచ్చింది. అప్పులు తీర్చేదారి లేక ఆవేదనకు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక సహాయం చేయాలంటూ జనవరి 2న రాజ్ భవన్ లోని ఫిర్యాదుల బాక్స్ లో తన లేఖ  వేశాడు. దీంతో రాజ్ భవన్ నుంచి నాలుగు రోజుల కింద ఆర్థిక సహాయంగా గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ రూ. 25వేల డీడీ పంపించారు. గవర్నర్ సాయం చేయడంతో రామ్మూర్తి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సాయంతో తన ఇబ్బందులు పోతాయని, గవర్నర్ కు రుణపడి ఉంటానని చెప్పాడు.

పేద కుటుంబం లెటర్ రాసిన వెంటనే స్పందించి సాయం చేసిన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వం చేయలేని పని చేసి చూపించారంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇటీవలే తమిళిసై సౌందర రాజన్‌ తీసుకున్న మరో నిర్ణయంపై కూడా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. తమిళి సైకి గుడికి వెళ్లడం అలవాటు. అయితే ఆమె గుళ్లకు వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆపాల్సి వస్తోంది. దీని వల్ల జనాలకు ట్రాఫిక్ సమస్య వస్తుందని గ్రహించిన గవర్నర్ తమిళిసై.. రాజ్ భవన్ లోని అమ్మవారి ఆలయంలోనే పూజలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయాన్ని రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. భక్తులు, ప్రజల ఇబ్బందికి గురి చేయడం ఇష్టం లేకే తమిళి సై ఈ నిర్ణయం తీసుకున్నారని గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. దీంతో తమిళి సై నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

READ ALSO: Lizard In Bawarchi Biryani: బావర్చి బిర్యానీలో బబ.. బల్లి.. సగం చికెన్ బిర్యానీ తిన్నాకా చూసిన కస్టమర్.. సోదాల్లో విస్తుపోయే నిజాలు

READ ALSO: Nara Lokesh Comments: టీడీపీలో టూ ప్లస్ వన్‌ ఫార్ములా ఫలిస్తుందా..? లోకేష్‌ వాదన ఏంటి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News