AP: అమరావతి రోడ్లపై కరెన్సీ కట్టలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది. నోట్ల కట్లలు రోడ్లపై ఎందుకు దర్శనమిస్తున్నాయి. కరెన్సీ నకిలీదైనా సరే..ఎందుకు వదిలెళ్లినట్టు. ఇప్పుడిదే చర్చనీయాంశమైంది.

Last Updated : Oct 20, 2020, 12:27 PM IST
AP: అమరావతి రోడ్లపై కరెన్సీ కట్టలు

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాజధాని అమరావతి ( Amaravati ) లో ఏం జరుగుతోంది. నోట్ల కట్లలు రోడ్లపై ఎందుకు దర్శనమిస్తున్నాయి. కరెన్సీ నకిలీదైనా సరే..ఎందుకు వదిలెళ్లినట్టు. ఇప్పుడిదే చర్చనీయాంశమైంది.

ఏపీ రాజధాని  ( Ap Capital ) అమరావతి రోడ్లపై నోట్ల కట్టలు పడేసి ఉండటం కలకలం సృష్టిస్తోంది. అమరావతి సమీపంలోని వెంగళాయపాలెం వద్ద జాతీయ రహదారిపైనే 2 వేలు, 5 వందల నోట్ల కట్టలు రోడ్డువారున పడేసి ఉండటం  ( Currency Bundles on Roads ) గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ నోట్లకట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కరెన్సీ మొత్తం నకిలీదిగా పోలీసులు తెలిపారు. మొత్తం రెండున్నర కోట్లు ఉన్నట్టు చెప్పారు. 

ఆశ్చర్యం కల్గించే అంశమేమంటే నకిలీ కరెన్సీను ( Fake currency ) నగదు డిపాజిట్ మెషీన్లు సైతం తీసుకోవడం. ఈ విషయాన్ని స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సర్కిల్ ఇన్ స్పెక్టర్ తెలిపారు. విజయవాడ, గుంటూరు నగర ప్రజలు నకీలీ కరెన్సీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నకిలీ కరెన్సీ అయినా సరే రోడ్లపై ఎందుకు వదిలేసి వెళ్లారో అర్ధం కావడం లేదు. ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారిప్పుడు. ఒకవేళ పోలీసులకు దొరికిపోతామనే భయంతో వదిలెళ్లుంటే..అసలు ఈ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవల్సిన అవసరం ఉంది. 

ఎందుకంటే నగదు డిపాజిట్ మెషీన్లు నకిలీ కరెన్సీను తీసుకుంటుంటే..అక్రమార్కులకు నకిలీ కరెన్సీ రవాణా మరింత తేలికైపోతుంది. అందుకే ప్రజల్ని అప్రమత్తంగా ఉండమని పోలీసులు సూచిస్తున్నారు. Also read: AP: రాష్ట్రంలో 3 నెలల కనిష్టానికి చేరిన కరోనా వైరస్ ఉధృతి

Trending News