ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) లో కరోనా వైరస్ ( Coronavirus ) ఉధృతి పూర్తిగా తగ్గిపోతోంది. గత 24 గంట్లలో నమోదైన కేసుల సంఖ్య 3 నెలల కాలంలో అత్యల్పంగా తెలుస్తోంది. భారీగా చేపట్టిన పరీక్షల కారణంగానే రాష్ట్రంలో అదుపులో వచ్చిందని తెలుస్తోంది.
మొన్నటివరకూ భయపెట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో శాంతిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య ( Corona new cases ) గణనీయంగా తగ్గుతోంది. గత 3 నెలలుగా రోజుకు కనీసం 10 వేల కేసులు నమోదవుతూ భయాందోళనకు గురిచేసిన పరిస్థితి. గత పదిహేను రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. అదే సమయంలో ప్రతిరోజూ చేస్తున్న కరోనా నిర్ధారణ పరీక్షల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడం లేదు.
గత 24 గంటల్లో ఎప్పటిలానే..61 వేల 330 మందికి కోవిడ్ 19 పరీక్షలు నిర్వహించగా...మూడు నెలల కనిష్టంగా కేవలం 2 వేల 918 కేసులు వెలుగు చూశాయి. మొదట్నించి రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల ( covid19 Tests ) పైనే దృష్టి పెట్టడం వల్ల..కరోనా వైరస్ రాష్ట్రంలో దాదాపుగా అదుపులో వచ్చిందంటున్నారు వైద్య నిపుణులు.
గత 24 గంటల్లో 4 వేల 303 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7 లక్షల 86 వేల 50 మంది కరోనా వైరస్ బారిన పడగా..7 లక్షల, 44 వేల 532 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 35 వేల 65 మాత్రమే యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం ఇప్పటివరకూ రాష్ట్రంలో 6 వేల 453 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకూ 71 లక్షల 27 వేల 533 పరీక్షలు నిర్వహించారు. Also read: AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ ఏరియల్ సర్వే