AP Wine Shops Close: ఆంధ్రప్రదేశ్ మద్యంప్రియులకు భారీ షాక్ తగిలింది. నిరవధికంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త మద్యం విధానం వలన తమ భవిష్యత్‌కు ప్రమాదం ఏర్పడడంతో మద్యం దుకాణంలో పని చేసే కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ రేపు శనివారం నుంచి సమ్మె చేపడుతున్నారు. కొత్త మద్యం విధానంతో తమ ఉద్యోగాలకు పోయే ప్రమాదంతో ప్రభుత్వం తమకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Farmer Suicide: రైతు ప్రాణం తీసిన రుణమాఫీ.. ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్య
మద్యం విధానంతో ఇరకాటం
వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యంలో కీలక మార్పులు జరిగాయి. కొన్ని నెలల పాటు సరైన మద్యం లభించక ప్రజలు ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నెగ్గి అధికారంలోకి రావడంతో ఇప్పుడు కొత్త మద్యం విధానం రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలు చేయనుంది. ఈ విషయమై ఇప్పటికే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతిలోనే మద్యం దుకాణాలను నడపనుంది.
Also Read: Family Suicide: స్నానం చేయిస్తానని చెప్పి పిల్లలను చెరువులోకి తోసి ఆపై ఆమె దూకి..విషాదం
ఉద్యోగుల ఉద్యమం
ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో మద్యం దుకాణాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్ ఉద్యోగులు పనులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో పని చేస్తున్న ఉద్యోగులు కొత్త మద్యం విధానంతో ఆందోళన చెందుతున్నారు. పాత పద్ధతిలో దుకాణాలు నడిపించనుండడంతో ప్రస్తుతం పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్ ప్రమాదకరంగా మారింది. తమ ఉద్యోగాల విషయమై ఆలోచించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టనున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు తాము ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. అయితే వీరి ఉద్యమం ఎన్ని రోజులు కొనసాగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలు ఉండడంతో మద్యం వ్యాపారం భారీగా సాగుతుంది. ఉద్యోగుల ఆందోళనతో మరి మద్యం వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
కొత్త మద్యం విధానం
ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తామని ప్రకటించింది. పాత పద్ధతిలోనే మద్యం విక్రయాలు ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలోకి రావడంతో కూటమి ప్రభుత్వం మద్యం విధానం సమూలంగా మార్చనుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలు చేయనున్న కొత్త మద్యం విధానంలో ప్రస్తుతం విధులు నిర్వహించే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
Wine Shops Close: ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులు వైన్స్ బంద్.. వినాయక చవితి కారణమా?