Ap Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఫలితం దక్కుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. అదే సమయంలో కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
ఏపీలో కరోనా సంక్రమణ వేగం తగ్గింది. అదే సమయంలో డిశ్చార్జ్ రేటు పెరిగింది. కరోనా మహమ్మారి (Corona pandemic) నియంత్రణకై ఏపీ ప్రభుత్వం (Ap government) అమలు చేస్తున్న విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 91 వేల 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests)చేయగా..18 వేల 285 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొన్నటి వరకూ ఈ సంఖ్య 20-22 వేల మధ్యలో ఉండేది. గత మూడ్రోజుల్నించి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో గత 24 గంటల్లో రాష్ట్రంలో 24 వేల 105 మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 14 లక్షల 24 వేల 859 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. గత 24 గంటల్లో అత్యధికగా చిత్తూరు జిల్లాలో 15, పశ్చిమ గోదావరి జిల్లాలో 14, విజయనగరంలో 9, అనంతపురం, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో 8 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 10 వేల 427 మంది మృత్యువాత పడ్డారు.
గత 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 3 వేల 296 కేసులు నమోదు కాగా...అనంతపురంలో 1876, చిత్తూరులో 1822 విశాఖలో 18 వందల కేసులు నమోదయ్యాయి. ఇక గుంటూరు జిల్లాలో 1211, నెల్లూరులో 1159, పశ్చిమ గోదావరి జిల్లాలో 1664 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1 లక్ష 92 వేల 104 యాక్టివ్ (Corona Active cases)కేసులున్నాయి. ఏపీలో ఇప్పటి వరకూ 1 కోటి 88 లక్షల 40 వేల 321 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు(Covid19 Tests) చేశారు.
Also read: AP High Court: కృష్ణపట్నం కరోనా మందుపై రేపు హైకోర్టులో విచారణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook