YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?

YS Jagan Fires on Chandrabau Naidu: ఏపీ అప్పుల చిట్టాను మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయటపెట్టారు. ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు అని.. కానీ రూ.14 లక్షల కోట్లు అప్పు చూపాలని చంద్రబాబు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 26, 2024, 03:35 PM IST
YS Jagan Mohan Reddy: రాష్ట్ర అప్పుల చిట్టా బయటపెట్టేసిన మాజీ సీఎం జగన్.. ఏపీ అప్పులు ఎంతంటే..?

YS Jagan Fires on Chandrabau Naidu: చంద్రబాబు సర్కారుపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైట్‌ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్రచారాలపై ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ధైర్యం లేదని.. రాష్ట్రం పూర్తిగా రివర్స్‌లో వెళ్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు లేదని.. ఎక్కడికక్కడ అణిచివేత ఉందన్నారు. చంద్రబాబుకు రెగ్యూలర్ బడ్జెట్ పెట్టే ధైర్యం లేదని.. ఎందుకంటే తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా.. ప్రశ్నించకుండా.. హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: RBI Recruitment 2024: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ  

"చంద్రబాబుకు ఒక మోడ్‌ ఆఫ్‌ ఆపరెండిస్‌ ఉంటుంది. అది ఒక వంచన. దగా, మోసం. ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయడం. ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటు. తాను ఎంచుకున్న, టార్గెట్‌ చేసిన వ్యక్తిపై విమర్శలు. దానిపై అందరూ మాట్లాడతారు. ఆ తర్వాత అనుకూల ఛానళ్లలో చర్చలు. వాటిలో నిశిత విమర్శలు. అంతా చేసి, చివరకు ఏం కంక్యూజన్‌ ఇస్తారంటే.. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి చంద్రబాబు చేస్తోంది మంచి అనిపిస్తారు. ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దింపడం మొదలు.. ఆ తర్వాత బీజేపీని తిట్టడం, మళ్లీ దగ్గరకు వెళ్లడం. మధ్యలో మరో పార్టీకి చేరువ కావడం. తాను ఏది చేసినా, అది మంచిదే అన్నది చెప్పుకుంటాడు. దాన్ని అందరితో ఔను అనిపించుకోవడం కోసం ట్రై చేస్తాడు.

రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు లేకున్నా.. అలా చూపాలని చాలా ప్రయత్నం చేశారు. అది సాధ్యం కావడంతో రూ.10 లక్షల కోట్లు అప్పు అన్నారు. దాన్నే గవర్నర్‌ గారి ప్రసంగంలో చెప్పించారు. పచ్చి అబద్దాలు చెబుతున్న చంద్రబాబు, గవర్నర్ ‌గారి ప్రసంగంలో కూడా అవే చెప్పించాడు. రెగ్యులర్‌ బడ్జెట్‌ ప్రవేశపెడితే, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆ పని చేయడం లేదు. నిజానికి ప్రభుత్వ అప్పులు ఎన్ని అని చూస్తే.. ఈ ఏడాది జూన్‌ వరకు ప్రభుత్వ అప్పు రూ.5,18,708 కోట్లు. బాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అప్పు రూ.2,71,798 కోట్లు. అదే రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,18,051 కోట్లు. ఇంకా గవర్నమెంట్‌ గ్యారెంటీల అప్పులు కూడా చూస్తే.. చంద్రబాబు దిగే నాటికి చూస్తే.. రూ.50 వేల కోట్లు. అవి మా ప్రభుత్వం దిగి పోయే నాటికి ఆ అప్పు రూ.1,06,000 కోట్లు మాత్రమే.

ఇంకా స్టేట్‌ లయబిలిటీ అప్పులన్నీ కూడా కలిపి చూస్తే.. బాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.1,53,347 కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి అవి రూ.4,08,710 కోట్లకు చేరాయి. ఇది 21.63 శాతం పెరుగుదల. అదే మన ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ,7,48,000 కోట్లు అప్పు ఉంది. ఇది 12.90 శాతం మాత్రమే పెరుగుదల. మరి, ఆయన హయాంలో అప్పులు ఎక్కువయ్యాయా? లేక మా హయాంలోనా? దీన్ని అందరూ గుర్తించాలి. కేంద్ర ఆర్థిక సర్వేలో.. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రశంసించారు. రాష్ట్ర అప్పులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్రం.. ఆ మొత్తం రూ.4,85,491 కోట్లు మాత్రమే.." అని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

నిజానికి కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గిందని.. అప్పుడు అవసరమైన అప్పు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినా, ప్రభుత్వం శక్తికి మించి అప్పు చేయలేదన్నారు. 2019లో తాము అధికారం చేపట్టేనాటికి ఖజానాలో ఉన్న మొత్తం కేవలం రూ.100 కోట్లు మాత్రమేనని గుర్తు చేశారు. చంద్రబాబు విడుదల చేస్తోంది ‘వైట్‌ పేపర్లు కాదు. తప్పుడు పేపర్లు’ అని ఎద్దేవా చేశారు.

Also Read: Sun Transit 2024: ఆగస్టు 16న సొంత రాశిలోకి సూర్యుడు.. ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News