Ganja Theft in PS: పోలీసు స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఇంతకీ ఏం పోయిందో తెలుసా ?

Ganja Theft in K Kotapadu Police Station: పోలీసు స్టేషన్‌లో దొంగలు పడ్డారు. అనకాపల్లి జిల్లా కే కోటపాడు పోలీస్ స్టేషన్ నుంచి 200 కేజీల గంజాయి చోరీ జరిగింది. గంజాయి చోరీ చేసింది ఎవరో కాదు.. హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్.. పూర్తి వివరాలు ఇదిగో..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2023, 04:04 AM IST
Ganja Theft in PS: పోలీసు స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఇంతకీ ఏం పోయిందో తెలుసా ?

Ganjai Theft in Police Station: పోలీసు స్టేషన్‌లో దొంగలు పడ్డారు. అవును.. ఇదేమీ సినిమా టైటిల్ కాదు.. అక్షరాల నిజం. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అని అనుకున్నారో ఏమో కానీ పోలీసు స్టేషన్‌లోనే చోరీకి పాల్పడ్డాడు అదే స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తోన్న కే శ్యామ్ కుమార్. ఇంతకీ పోలీసు స్టేషన్ నుంచి దొంగలు దోచుకెళ్లింది ఏంటో తెలిస్తే.. మీరు మరింత షాక్ అవుతారు. 

అనకాపల్లి జిల్లా కే కోటపాడు పోలీసులకు కొత్త చిక్కొచ్చిపడింది. ఇంట్లో దొంగలు పడ్డారు మొర్రో అంటూ అందరు పోలీసు స్టేషన్ మెట్లెక్కుతారు. మరి పోలీసు స్టేషన్‌లోనే దొంగలు పడితే వారి పరిస్థితి ఏంటి ? అనకాపల్లి జిల్లా కే కోటపాడు పోలీసులకు శుక్రవారం అటువంటి అయోమయమైన పరిస్థితే ఎదురైంది. కే కోటపాడు పోలీసు స్టేషన్‌లో ఇంటి దొంగలు పడ్డారు. ఇటీవల గంజాయి స్మగ్లర్ల నుంచి పట్టుబడిన గంజాయిని స్టేషన్‌లో నిల్వచేయగా.. తాజాగా అందులోంచి 200 కిలోల గంజాయి మాయమైంది.

పోలీస్ స్టేషన్ నుంచి 200 కేజీల గంజాయి మాయమైందని తెలుసుకున్న అధికారులు తలలు పట్టుకున్నారు. బయటికి తెలిస్తే పరువు పోతుందనే భయం ఒకవైపు.. లేదంటే మాయమైన గంజాయి ఏమైనట్టు అనే ఆలోచన మరోవైపు.. మొత్తానికి విషయం పై అధికారులకు తెలియడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది. 

అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్‌తో ఎంక్వయిరీ జరిపించగా.. మాయమైన గంజాయి వెనుక ఇంటి దొంగ హస్తం ఉందని తెలిసింది. దీంతో గంజాయి చోరీకి పాల్పడిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. నిందితుల్లో ముగ్గురు జువైనల్స్ ఉండటం గమనార్హం. 

కే కోటపాడు పోలీసు స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కే శ్యామ్ కుమార్ సహకారంతోనే ఆ నలుగురు పోలీసు స్టేషన్‌లోకి ప్రవేశించి మరి గంజాయిని ఎత్తుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో గంజాయి చోరీ కేసులో నలుగురు నిందితులతో పాటు హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ కుమార్ పేరు సైతం నిందితుల్లో చేర్చినట్టు సమాచారం. చోరీలు జరగకుండా చూడాల్సిన పోలీసే దొంగలకు తాళం చెవి ఇచ్చి నేరానికి ప్రోత్సహించడం ఏంటంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. అత్యాశ కొంపకు చేటన్నట్టు.. బాధ్యతాయుతమైన హోదాలో ఉంటూ అడ్డదారిలో డబ్బు సంపాదించాలని చూసినందుకుగాను ఇప్పుడు ఉన్న ఉద్యోగానికే ఎసరొచ్చిపడింది.

ఇది కూడా చదవండి : Nagababu Slam Roja: హవ్వ.. మంత్రి రోజాను నాగబాబు దాంతో పోల్చారేంటి ?

ఇది కూడా చదవండి : KIA EV6 Car: ఈ క్రేజీ కారు కొనేవారికి షాకింగ్ న్యూస్

ఇది కూడా చదవండి : Best Recharge Plans: తక్కువ ధరకే ఏడాదిపాటు రోజూ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, సూపర్ రీచార్జ్ ప్లాన్ కదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News