Nagababu Comments on Minister RK Roja: మంత్రి రోజాపై ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ నేత నాగబాబు పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీది నోరు అనుకోవాలా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా అనుకోవాలా అని మండిపడ్డారు. చూస్తూ చూస్తూ మునిసిపాలిటీ కుప్పతొట్టిలో ఎవ్వరూ వేలు పెట్టరని.. అందుకే నువ్వు మా అన్నయ్య చిరంజీవిని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని ఎన్ని మాటలు అన్నా తాను స్పందించడం మానేశానని అన్నారు. ఈ మేరకు నాగబాబు మీడియాకు ట్విటర్ ద్వారా ఒక వీడియో స్టేట్మెంట్ విడుదల చేశారు. ఈ ట్వీట్‌లో మంత్రి రోజాను కూడా ట్యాగ్ చేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. భారత దేశంలో వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖల పని తీరుపై ఇటీవల ప్రకటించిన జాబితాలో తొలి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలు ఉండగా.. 20 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 18వ స్థానంలో ఉందని అన్నారు. 19, 20 స్థానాల్లో ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్ ఉన్నాయని.. మంత్రి రోజా పని తీరు ఇలాగే ఉంటే ఆమె పర్యాటక శాఖ మంత్రి పదవి నుంచి వైదొలగే నాటికి ఏపీ రాష్ట్రం మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
రోజా @RojaSelvamaniRK
నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్పతొట్టా ? pic.twitter.com/SFeIpZdBeL— Naga Babu Konidela (@NagaBabuOffl) January 6, 2023
రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యాటక శాఖపై ఆధారపడి చాలామంది బతుకులు వెళ్లదీస్తున్నారని వ్యాఖ్యానించిన నాగబాబు.. వైసీపీ అధికారంలోకి వచ్చాకా వారి పరిస్థితి ధీనంగా తయారైందని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదని.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచించి పని చేయాలని మంత్రి రోజాకు నాగబాబు హితవు పలికారు.
ఇది కూడా చదవండి : Minister Roja: వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సున్నా.. పవన్ ఓడిపోతే అదే చేయాలి.. మంత్రి రోజా సెటైర్లు
ఇది కూడా చదవండి : Minister Roja: బ్యాట్ పట్టిన మంత్రి రోజా.. అచ్చం క్రికెటర్‌లానే..
ఇది కూడా చదవండి : Minister Roja, Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పిచ్చిపిచ్చి వేషాలేయొద్దు : మంత్రి రోజా వార్నింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook