Visakhapatnam Fire Accident: విశాఖపట్నం సెజ్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్, చెలరేగిన మంటలు, ఆరుగురికి గాయాలు

Visakhapatnam Fire Accident: విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీకై..దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..ఆరుగురికి గాయాలయ్యాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2021, 10:25 PM IST
  • ఏపీ విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం
  • అచ్యుతాపురం సెజ్ ఫెర్రో అల్లాయిస్ కంపెనీలో గ్యాస్ లీకజ్, చెలరేగిన మంటలు
  • ఆరుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
 Visakhapatnam Fire Accident: విశాఖపట్నం సెజ్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్, చెలరేగిన మంటలు, ఆరుగురికి గాయాలు

Visakhapatnam Fire Accident: విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీకై..దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..ఆరుగురికి గాయాలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో(Visakhapatnam)మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. విశాఖపట్నంలోని అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది. అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ కంపెనీలో ఇవాళ మద్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకైంది. అనంతరం దట్టమైన పొగలతో పాటు మంటలు(Gas Leakage)చెలరేగాయి. పగలు సమయం కావడంతో పరిశ్రమలో సిబ్బంది పనిచేస్తున్నారు. కొందరు భయంతో పరుగులు తీయగా, మరి కొందరు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆరుగురికి గాయాలైనట్టు సమాచారం. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ ట్యాంకర్ పైప్‌లైన్ లీకేజ్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మద్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదం జరిగినా..పరిశ్రమ యాజమాన్యం గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Also read: IRCTC BUG: ఐఆర్‌సీటీసీలో బగ్ గుర్తించిన ఇంటర్ విద్యార్ధి, తప్పిన పెను ప్రమాదం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x