గ్రామ వాలంటీర్ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు

గ్రామ వాలంటీర్ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు

Last Updated : Aug 3, 2019, 12:50 PM IST
గ్రామ వాలంటీర్ అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు

విజయవాడ: గ్రామ వాలంటీర్ల నియామకం పూర్తయిన తర్వాత కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లాగా విధుల్లో అలసత్వం వహించినా తమ ఉద్యోగం ఎక్కడికి పోదనే భ్రమలో ఉన్న అభ్యర్థులకు ఏపీ సర్కార్ ఝలక్ ఇచ్చింది. అవును, గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వారి పనితీరు బాగుంటేనే వారిని వాలంటీర్‌గా కొనసాగిస్తామని.. లేదంటే ఉద్యోగం ఊస్టింగేననే నిభందనను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. వాలంటీర్ల పనితీరును ఏడాదిపాటు పరిశీలించి, వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటేనే కొనసాగించాలని.. లేదంటే వారి స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇదేకాకుండా వాలంటీర్ల విధులలో భాగంగా 35 రకాల విధులు నిర్వహించాలనే నిభందన అభ్యర్థులను హడలెత్తిస్తున్నట్టు సమాచారం. 

ఇదిలావుంటే, వాలంటీర్‌గా నియమితులయ్యే వారికి నియామక పత్రం అందించడానికి బదులుగా ఒప్పంద పత్రం ఇస్తుండటాన్ని పరిశీలిస్తే... అంకిత భావంతో పనిచేసే వారికి మాత్రమే ఉద్యోగం పదిలం అని సర్కార్ చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతోంది.

Trending News