Petrol Attack: విశాఖలో ప్రియురాలిపై దాడి చేసిన యువకుడు హర్షవర్ధన్‌ మృతి

Harshavardhan a young man who attacked his girlfriend in Visakhapatnam was died : ఈ నెల 13న తాను ప్రేమించిన యువతిని... నీతో మాట్లాడాలి.. అంటూ విశాఖపట్నంలో ఒక సూర్యాబాగ్‌ లోని ఓ హోటల్ కు పిలిపించుకున్నాడు. అక్కడకు వచ్చిన యువతిపై హర్షవర్ధన్‌ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 12:55 PM IST
  • విశాఖపట్నం సూర్యాబాగ్‌ లోని ఓ హోటల్లో యువతిపై పెట్రోల్‌తో దాడి చేసిన యువకుడి మృతి
  • తనపై కూడా పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు
  • కేజీహెచ్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి
Petrol Attack: విశాఖలో ప్రియురాలిపై దాడి చేసిన యువకుడు హర్షవర్ధన్‌ మృతి

Harshavardhan a Young man who set himself on fire over rejection of love dies in Visakhapatnam at KGH: ఏపీలోని విశాఖపట్నం సూర్యాబాగ్‌ లోని ఓ హోటల్లో యువతిపై పెట్రోల్‌తో దాడి చేసి.. తనపై కూడా పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు హర్షవర్ధన్‌ (Harshavardhan) మృతి చెందాడు. కేజీహెచ్‌ (KGH) లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ హర్షవర్ధన్‌ ఇవాళ ఉదయం మరణించాడు. కాగా ఈ నెల 13న తాను ప్రేమించిన యువతిని... నీతో మాట్లాడాలి.. అంటూ విశాఖపట్నంలో (Visakhapatnam) సూర్యాబాగ్‌ లోని ఓ హోటల్ కు పిలిపించుకున్నాడు. అక్కడకు వచ్చిన యువతిపై హర్షవర్ధన్‌ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బాధితులిద్దరిని కేజీహెచ్‌ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Also Read : Corona Update in India:భారీగా తగ్గిన కరోనా కేసులు.. గడిచిన 287 రోజుల్లో ఇదే అత్యల్పం

హన్మకొండకు చెందిన యువకుడు హర్షవర్ధన్‌, విశాఖపట్నానికి చెందిన యువతి పంజాబ్‌లో (Punjab) ఇంజనీరింగ్‌ (engineering) పూర్తి చేశారు. వారి మధ్య కొన్నాళ్లు ప్రేమ వ్యవహారం నడించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోపే హర్షవర్ధన్‌ (Harshavardhan) ఈనెల 13న యువతిని సూర్యాబాగ్‌ లోని ఓ హోటల్‌కు పిలిచాడు. అక్కడికి వచ్చిన ఆమెకు, హర్షవర్ధన్‌ కు మధ్య గొడవ ఏర్పడింది. ఆమె పెళ్లికి నిరాకరించడమే కారణమని తెలుస్తోంది. ఈ క్రమంలో హర్షవర్ధన్‌.. ఆమెపై పెట్రోల్‌తో (Petrol‌) దాడి చేసి.. తనపై కూడా పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. పోలీసులు కేసు (case) దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Anantapur robbery : అనంతపురం జిల్లా కదిరిలో దొంగల బీభత్సం.. ఉపాధ్యాయురాలి హత్య

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News