జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్న వస్తున్న వార్తల్లో నిజం లేదని ..పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్న జనసే పార్టీ తరఫున ఎన్నకైనందుకు గర్వంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాను ఒక్కడైనప్పటికీ.. అసెంబ్లీలో జనసేన వాయిస్ బలంగా వినిపిస్తానని... ప్రజల మంచి కోసం పనిచేసే పనులకు స్వాగతిస్తానని ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తానని రాపాక వరప్రసాద్ వెల్లడించారు.
గత ఎన్నికల్లో రాజోలు నియోగకవర్గం నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ తో పాటు అభ్యర్ధులు అందరూ ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీ తరఫున రాపాక ఒక్కరే గెలుపొందడం గమనార్హం. జనసేన తరఫున అసెంబ్లీ లో అడుపెట్టాల్సిన రాపాక... ఇటీవలె కాలంలో రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ పవన్ ను కలిసిన అనంతరం ఆయన మీడియా ముందుకు వివరణ ఇచ్చారు
2019 ఎన్నికల్లో జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాపాకకు.. వైసీపీ మంత్రి పదవికి ఆశచూపిస్తూ ఎరవేస్తోందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. జగన్ పార్టీలో చేరితే ఎస్సీ సామాజిక వర్గ కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ చీఫ్ జగన్ తో రాపాక టచ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ ఊహాగానాలకు తెరదించుతూ రాపాక వరస్రాద్... తాను పవన్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.