mp chamala kiran kumar reddy fires on anchor baladitya: హైదరాబాద్ లోని హైటెక్స్ లో హెచ్‌ఐసీసీలో ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో..దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఇన్ వైట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది.. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి హల్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. అక్కడున్న యాంకర్ బాలాదిత్య.. సీఎం రేవంత్ రెడ్డి బదులు.. సీఎం కిరణ్ కుమార్ అంటూ తప్పుగా పేరు పలికారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా.. గట్టిగా అరవడంతో గందర గోళం ఏర్పడింది.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
తెలుగు మహా సభల్లో పేరు మర్చిపోయిన యాంకర్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ముఖ్యమంత్రి పేరు చెప్పకపోవడం వెనక ఎదో కుట్ర ఉంది
ఎవడయ్యా ఆ తెలుగు మహా సభలు పెట్టింది
తెలుగు మహాసభలు పెట్టిన వాడికి బుద్ధి లేదా.. ముఖ్యమంత్రే తెలవని వాళ్లు… https://t.co/RkiGIqmwcG pic.twitter.com/d3fpP0INws
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
ఆ తర్వాత మరల తన తప్పును తెలుసుకుని.. సారీ అని చెబుతూ.. బాలాదిత్య.. సీఎం రేవంత్ రెడ్డి అని కవర్ చేసుకున్నాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టంజరిగిపోయిందని తెలుస్తొంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ కు అవమానం.. ఆయనను పిల్చి పేరునుమర్చిపోయి అవమానం చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై తాజాగా.. కాంగ్రెస్ ఎంపీ.. చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు.
తెలుగు స్టేట్స్ లలో సీఎం ఎవడో తెల్వనోడు యాంకర్ ఎలా అవుతాడని మండిపడ్డారు. యాంకర్ కు సదువు రాదా..?...మనం చిన్న చిన్న కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో రాసుకుని వస్తాం.. అలాంటిది.. ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఆయన పేరు.. ఆ కార్యక్రమం ఏంటీదని కనీసం అవగాహన లేకుండా... యాంకరింగ్ చేస్తాడా.. అంటూ మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో దీని వెనకాల ఏదో కుట్ర ఉందని కూడా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా.. గతంలో పుష్ప2 సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయిన ఘటన పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే.
Read more: BRS KTR Case: కేటీఆర్‌కు హైకోర్టు బిగ్ షాక్.. దూకుడు పెంచిన ఏసీబీ..పలుచోట్ల సోదాలు..
మరొవైపు.. సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ ను రేవంత్ సర్కారు.. చుక్కలు చూపించిందని కూడా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి యాంకర్ సీఎ రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ఎంపీ చామల మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.