Pawan Kalyan Comments: వైసీపీ గ్రూప్ తగాదాల వల్లే కోనసీమ అల్లర్లు..పవన్‌ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

Pawan Kalyan Comments: ఏపీలో కోనసీమ అల్లర్ల సెగలు తగడం లేదు. దీనిపై అధికార,విపక్షాల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 3, 2022, 09:17 PM IST
  • ఏపీలో కోనసీమ అల్లర్ల సెగలు
  • అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం
  • తాజాగా పవన్‌ కళ్యాణ్‌ హాట్ కామెంట్స్
Pawan Kalyan Comments: వైసీపీ గ్రూప్ తగాదాల వల్లే కోనసీమ అల్లర్లు..పవన్‌ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

Pawan Kalyan Comments: ఏపీలో కోనసీమ అల్లర్ల సెగలు తగడం లేదు. దీనిపై అధికార,విపక్షాల మధ్య ఇంకా మాటల యుద్ధం కొనసాగుతునే ఉంది. ఘటన వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐతే అధికారపక్షం మాత్రం టీడీపీ, జనసేన కార్యకర్తల వల్లే ఇదంతా జరిగిందని కౌంటర్ ఇస్తోంది. తాజాగా కోనసీమ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు.

కోనసీమ గొడవలు ఉద్దేశపూర్వకంగా జరిగినవేనన్నారు. ఘటనాస్థలికి సీఎం జగన్, మంత్రులు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కోనసీమ తగలబడుతుంటే మంత్రుల బస్సు యాత్ర దేనికని ఫైర్ అయ్యారు. అమలాపురం అల్లర్లలో ఇళ్లు తగలబడుతున్నా..అగ్నిమాపక దళాలు రాకపోవడం పలు అనుమానాలు కల్గిస్తోందన్నారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ఆలోచన ఉంటే ముందే చేసేవారని చెప్పారు.

జిల్లాల విభజనను సరైన రీతిలో చేయాలని విమర్శించారు పవన్‌ కళ్యాణ్. అలజడి సమాచారం నిఘా విభాగానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. గొడవలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి ముందే తెలుసు అని ఆరోపించారు. అందుకే ఇప్పటివరకు పాలకులు స్పందించలేదన్నారు. సమస్య అంబేద్కర్ వల్ల కాదని..ఒక పార్టీలో రెండు వర్గాల మధ్య గొడవ అని తెలిపారు. వాళ్ల పార్టీలోనే భిన్నాభిప్రాయాల వల్లే గొడవలు జరిగాయన్నారు పవన్.

Also read: 7th Pay Commission: త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..డీఏ పెంపు ఎంతంటే..!

Also read:TS RTC Jobs: తెలంగాణలో కొలువుల జాతర..ఆర్టీసీ నుంచి మరో నోటిఫికేషన్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News