తెలుగు ప్రజల మధ్య  కొట్లాట కాదు..సహకారం కావాలి - జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం

జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రత్యేక అతిధిగా హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. 

Last Updated : May 30, 2019, 02:17 PM IST
తెలుగు ప్రజల మధ్య  కొట్లాట కాదు..సహకారం కావాలి - జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం

విజయవాడ: వైఎస్ జగన్ ప్రమాణస్వీకారోత్సవంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉద్వేగంగా ప్రసంగించారు. నవ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ప్రజల పక్షాన హృదయ పూర్వక అభిందనలు, ఆశీస్సులు తెలిపారు.తెలుగు ప్రజల జీవన గమనంలో ఇది అపూర్వ ఘట్టం. తెలుగువాళ్లు పరస్పరం కలిసి ముందుకు సాగడానికి ఈ ఘట్టం బీజం వేస్తుందని తాను ఆశిస్తున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.

వయస్సు చిన్నది కానీ బాధ్యత పెద్దది..

జగన్ ను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ ముఖమంత్రి జగన్ వయస్సు చిన్నది...కానీ బాధ్యత చాలా పెద్దది. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలరని గత పదేళ్ల కాలంలో   ప్రతిపక్ష నేతగా జగన్ నిరూపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ సంపూర్ణ విజయం సాధించాలని ఈ సందర్భంగా కేసీఆర్ తన ఆశీస్సులు అందించారు. ఈ రాష్ట్రంలో జగన్ కనీసం వరుగా మూడు పర్యయాలు  సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ ఆకాంక్షించారు.

సహకారంతో ముందుకు వెళ్దాం..

తెలుగు ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ఇప్పుడు మన మధ్య కావాల్సింది కొట్లాట కాదు.. పరస్పర సహకరాం. అప్పుడే అద్భుత ఫలితాలు సాధింగలమన్నారు. ఏపీ ప్రభుత్వం సహజవనరులు, జలవనరులను సక్రమంగా వినియోగించి మంచి ఫలితాలు సాధించాలని కేసీఆర్ ఆంకాక్షించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. 

Trending News