Krishnapatnam Medicine Distribution: ఔషధానికి ఏపీ ప్రభుత్వ సహకారం లేదు: Anandaiah Comments

Krishnapatnam Anandaiah Comments On AP Govt over Medicine Diatribution: మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కరోనా మందు పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నామని ఆనందయ్య తెలిపారు. ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాల వారికి ఔషధం పంపిణీ చేయాలనుకున్నామని ఆనందయ్య తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 7, 2021, 02:18 PM IST
  • గత నెల 21న కరోనా మందు పంపిణీ నిలిపివేసిన ఏపీ సర్కార్
  • ఆనందయ్య ఔషధానికి అనుమతి రావడంతో నేటి నుంచి పంపిణీ
  • అయితే తనకు ప్రభుత్వ సహకారం లేదని చెప్పిన ఆనందయ్య
Krishnapatnam Medicine Distribution: ఔషధానికి ఏపీ ప్రభుత్వ సహకారం లేదు: Anandaiah Comments

Krishnapatnam Anandaiah Comments On AP Govt : నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన ఔషధం పంపిణీ చేస్తున్నారు.  నిన్న కరోనా మందును ఆనందయ్య కుటుంబం పంపిణీ చేస్తుంటే నిబంధనలకు విరుద్ధంగా ఔషధం పంపిణీ మొదలుపెట్టారని పోలీసులు అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో నేటి ఉదయం కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు పంపిణీ మరోసారి ప్రారంభించారు.

మొదటగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కరోనా మందు పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నామని ఆనందయ్య తెలిపారు. ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాల వారికి ఔషధం పంపిణీ చేయాలనుకున్నామని, దయచేసి పొరుగు ప్రాంతం నుంచి తాము చెప్పే వరకూ కరోనా మందు (Anandayya Corona Medicine) కోసం రావొద్దని ఆనందయ్య సూచించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదని వ్యాఖ్యానించారు.

Also Read: Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా

కరోనా తగ్గడానికి తయారు చేస్తున్న ఔషధ పంపిణీకి ఏపీ ప్రభుత్వం కేవలం అనుమతి ఇచ్చిందని, అయితే ఇతర ఏ విషయంలో సహకారం ఇప్పటివరకూ అందించలేదని వెల్లడించారు. ఔషధం తయారీ సామాగ్రి విషయంలోగానీ, మందు పంపిణీకి వనరుల సమకూర్చడంలోనూ ప్రభుత్వం నుంచి సహకారం అందలేదన్నారు. ఏపీ ప్రభుత్వం సహకారం అందిస్తే ఏపీలోని అన్ని ప్రాంతాలకు ఔషధాన్ని అందిస్తామన్నారు. మరోవైపు వెబ్‌సైట్ ద్వారా ఆనందయ్య కరోనా మందు (Anandaiah Medicine) పంపిణీపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Also Read: Krishnapatnam ఆనందయ్య Corona Medicine పంపిణీ ప్రారంభం, కృష్ణపట్నంలో గందరగోళం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News