హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసు వ్యవహారంపై నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. మరోమారు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ వ్యహారంపై స్పందించారు. ఈ కేసు విషయంలో చంద్రబాబు ఎందుకు అలా ఉలిక్కిపడుతున్నారో అర్థం కావడం లేదని...తప్పు చేయనపుడు భయం ఎందుకని ప్రశ్నించారు.
పౌరుల వ్యక్తి సమాచారం అక్రమంగా భద్రపరిచారనే ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు కేసు నమెదు చేశారు.అది కూడా తమ ప్రాంతంలో ఫిర్యాదు రావడంతో ఇక్కడి పోలీసులు స్పందించారని మరోమారు వివరణ ఇచ్చారు.
పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఏపీ ప్రభుత్వం వ్యక్తిగత గోప్యత చట్టానికి తూట్లు పొడిచిందని కేటీఆర్ మండిపడ్డారు. వారు చేసిన తప్పు బయటపడిందనే చంద్రబాబు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు