లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) అసిస్టెంట్ పోస్టుల (క్యాషియర్, క్లర్క్, సింగిల్ విండో ఆపరేటర్, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్) భర్తీకి సంబంధించి నిర్వహించిన మెయిన్స్ పరీక్షా ఫలితాలను వెల్లడించింది. అసిస్టెంట్ పోస్టుల ఫలితాల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల ఫలితాలు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. అభ్యర్థులు ఏ ఇబ్బంది లేకుండా కింది లింక్ మీద క్లిక్ చేసి ఎల్ఐసీ అసిస్టెంట్ ఫలితాలు చూసుకోవచ్చు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేశ వ్యాప్తంగా పలు డివిజన్ల పరిధిలో దాదాపు 8వేల అసిస్టెంట్ పోస్టులకు గతేడాది డిసెంబర్ 22న మెయిన్స్ పరీక్ష నిర్వహించింది. తొలుత అక్టోబరు 30, 31 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించగా లక్షలాది అభ్యర్థులు హాజరయ్యారు. అందులోంచి మెయిన్స్‌కు అభ్యర్థుల్ని మెరిట్ ప్రకారం ఎంపిక చేసి.. మెయిన్స్ ఎంట్రెన్స్ నిర్వహించారు. దక్షిణాదిన (సౌత్ రీజియన్) మొత్తం 631 పోస్టులుండగా, ఏపీ, తెలంగాణలకు కలిపి 276 పోస్టులు కేటాయించారు.
Also Read: ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం
ప్రాంతాలు - పోస్టులు
హైదరాబాద్ - 40
కరీంనగర్ - 68
వరంగల్ - 11
విశాఖపట్నం - 46
కడప - 40
మచిలీపట్నం - 24
నెల్లూరు - 36
రాజమండ్రి - 11
ఎల్ఐసీ అసిస్టెంట్ ఫలితాలు విడుదల