Murder for Chicken Curry: చికెన్ కర్రీ వండలేదని.. చెల్లెలిని దారుణంగా హత్య చేసిన అన్న..

Murder for Chicken Curry: చికెన్ కర్రీ వండలేదన్న ఆగ్రహంతో ఓ అన్న సొంత చెల్లెలినే దారుణంగా హతమార్చాడు. గొడ్డలితో నరికి ఆమెను హత్య చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 10:57 AM IST
  • తూర్పు గోదావరి జిల్లాలో దారుణం
  • చికెన్ కర్రీ వండలేదని చెల్లెలిని హత్య చేసిన అన్న
  • గొడ్డలితో నరికి చంపిన దుర్మార్గుడు
Murder for Chicken Curry: చికెన్ కర్రీ వండలేదని.. చెల్లెలిని దారుణంగా హత్య చేసిన అన్న..

Murder for Chicken Curry: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కోడి కూర వండలేదన్న కారణంతో సొంత చెల్లెలిని దారుణంగా హత్య చేశాడో అన్న. గొడ్డలితో వెంటాడి మరీ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో విలవిల్లాడుతూ ఆమె ప్రాణాలు విడిచింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల కథనం ప్రకారం... కొవ్వాసి నంద అనే వ్యక్తి తూర్పు గోదావరి జిల్లా కన్నాపురంలో నివాసముంటూ స్థానికంగా కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో నివాసముండే నంద సోదరి సోమమ్మ (20) ఇటీవల అతని ఇంటికి వచ్చింది. సోమమ్మ సోదరుని ఇంటికి వచ్చాక అతని భార్య పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల్లో మళ్లీ కన్నాపురం వస్తానని చెప్పింది.

ఈ క్రమంలో గురువారం (మార్చి 3) నంద పీకలదాకా తాగి రాత్రి 10 గంటలకు ఇంటికొచ్చాడు. వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చిన నంద.. సోదరిని వంట చేయమని చెప్పాడు. తనకు నీరసంగా ఉందని.. ఇప్పుడు వంట చేయలేనని సోమమ్మ అతని సోదరుడితో చెప్పింది. అయినప్పటికీ నంద వినిపించుకోలేదు. తాను ఇంటికొచ్చేసరికి చికెన్ వండి పెట్టాలని చెప్పి బయటకెళ్లాడు.

అలా బయటకెళ్లిన నంద తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున ఇంటికొచ్చాడు. వచ్చీ రాగానే చికెన్ కర్రీ వండావా లేదా అని చెల్లెలు సోమమ్మను ప్రశ్నించాడు. వండలేదని సోమమ్మ చెప్పడంతో ఆమెపై దాడికి యత్నించాడు. దీంతో సోమమ్మ గట్టిగా అరుస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టింది. సోమమ్మ వెనకాలే గొడ్డలి అందుకుని పరిగెత్తిన నంద.. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. సోదరుడి దాడిలో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడు నందను స్థానికులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

Also Read: Shane Warne Ball of the Century: షేన్‌ వార్న్‌ 'బాల్‌ ఆఫ్‌ ది సెంచరీ'.. చూస్తే మతులు పోవాల్సిందే (వీడియో)!!

Also Read: MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News