Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

పరిపాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2022, 11:04 AM IST
  • ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు
  • ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో భాద్యతలు చేపట్టనున్న ఆఫిసర్లు
  • అటు రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం
Andhra Pradesh: ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

AP Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగాయి. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 4వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో వారు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అటు రాష్ట్రంలో 51 మంది ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మొత్తం 26 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు శనివారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.  అలాగే విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా శ్రీకాంత్, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా మనీష్‌కుమార్‌ సిన్హాను నియమించింది. 

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్‌.రాధిక నియమించింది ప్రభుత్వం.  విజయనగరం జిల్లా ఎస్పీగా దీపిక, కృష్ణా జిల్లా ఎస్పీ గా సిద్ధార్థ కౌశల్‌, విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటాను కొనసాగించింది. గుంటూరు ఆర్బన్‌ ఎస్పీగా కె.ఆరీఫ్‌ హాఫీజ్‌ ను అలాగే కొనసాగించింది. ఇక కొత్తగా పార్వతీపురం ఎస్పీగా వాసన విద్య సాగర్‌ నాయుడు, అనకాపల్లి ఎస్పీగా గౌతమి సాలిని నియమించింది.

అల్లూరి సీతారామరాజు ఎస్పీగా సతీశ్‌కుమార్, కాకినాడ ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు, కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్‌.ఎస్‌.వి. సుబ్బారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగిని నియమించింది ఏపీ సర్కార్‌. పశ్చిమగోదావరి జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్‌, ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డిని నియమించింది. 

Also Read: Maxwell Join RCB: ఆర్సీబీ శిబిరంలో చేరిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్!

Also Read: Petrol Diesel Price Hike: ఆగని పెట్రో బాదుడు.. మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News