Minister Roja: పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి రోజా

Minister Roja Coomments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని మంత్రి రోజా సెటైర్లు వేశారు. తన తల్లి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఊసరవెల్లి చేష్టలు బీజేపీకి బాగా తెలుసని అన్నారు. 

Written by - Ashok Krindinti | Last Updated : Jul 19, 2023, 05:13 PM IST
Minister Roja: పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి రోజా

Minister Roja Coomments On Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు  పర్యాటక శాఖ మంత్రి రోజా. చంద్రబాబు కోసం ఢిల్లీలో పవన్‌ కళ్యాణ్‌ దళారీగా మారాడని ఫైర్ అయ్యారు. తన తల్లిని తిట్టించిన వ్యక్తి కోసం పవన్‌ దళారీగా మారడం సిగ్గుచేటని అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ దళపతి కాదు దళారీ అని అన్నారు. విజయవాడలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌ ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడు కానీ.. ప్రజల కోసం పనిచేయడం లేదని కాపులు, జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలని హితవు పలికారు. జనసేన పార్టీ కార్యకర్తలకు, కాపు సామాజిక వర్గానికి పవన్‌ క్షమాపణలు చెప్పాలన్నారు.

చంద్రబాబు దిగజారుడు, అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్టీయే సమావేశానికి పిలవకుండా పక్కనబెట్టారని ఆమె అన్నారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్‌ చెబుతారని పవన్‌ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. కనీస అవగాహన లేకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు అని ప్రశ్నించారు. సినిమాల్లో రైటర్స్‌ రాసిచ్చింది.. మీటింగ్స్‌లో చంద్రబాబు స్క్రిప్టు మాత్రమే చదువుతావా..? అని నిలదీశారు. 

మోదీని తిట్టిన చంద్రబాబును ఎన్డీయే సమావేశానికి పిలవలేదని.. సోషల్‌ మీడియా వేదికగా తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్‌ కలిసిపోయాడని మంత్రి రోజా అన్నారు. తల్లి ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టి చంద్రబాబు కోసం దిగజారిపోయి దళారీలా పనిచేస్తున్నాడన్నారు. 3 పార్టీలు కలిసి పోటీచేస్తాయని పవన్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. 

తుని సభలో దళపతిని అని మాట్లాడిన పవన్‌.. చంద్రబాబు కోసం ఢిల్లీకి వెళ్లి దళారీలా పనిచేస్తున్నాడన్నారు. రాజకీయ పార్టీ పెట్టి వేరొక వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి పనిచేస్తున్న దేశంలోనే ఒకే ఒక దద్దమ్మ పవన్‌ కళ్యాణ్‌ మాత్రమేనన్నారు. పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైందన్నారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలులేక పవన్‌ మళ్లీ టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని గతంలో ప్రగల్భాలు పలికిన పవన్‌.. ఇప్పుడు సిగ్గులేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని లేఖలు పంపినా బీజేపీ ఎన్డీయే సమావేశానికి పిలవలేదని, బాబు ఊసరవెల్లి చేష్టలు బీజేపీకి బాగా తెలుసన్నారు. రాహుల్‌ను ప్రధాని చేస్తానన్న బాబు కాంగ్రెస్‌ను సైతం మోసం చేశాడని గుర్తుచేశారు. 

Also Read: Ongole Attack Video: ఒంగోలులో దారుణం.. యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు  

Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook  

Trending News