నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చింది. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పటిషన్లపై సుదీర్ఘకాలం పాటు విచారించిన ట్రిబ్యూనల్ శుక్రవారం తీర్పువెలువరించింది. రాజధాని నిర్మాణం పేరుతో పర్యావరణానికి హాని కల్గిస్తున్నారన్న పిటిషనర్ల అభ్యంతరాలను ట్రిబ్యూనల్ తోసిపుచ్చింది. అయితే పర్యావరణశాఖ నింబంధనలను పాటిస్తూ.. నిర్మాణం చేపట్టాలని ఏపీ సర్కార్‌కు ఆదేశించింది. దీన్ని పర్యవేక్షించేందుకు కమిటీ నియమించింది. ఈ కమిటీ సభ్యులు రాజధాని నిర్మాణపనులను పరిశీలిస్తారు..దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు జాతీయ హరిత ట్రైబ్యునల్ కు చేరవేస్తుంటారు.