ఇష్టంలేని పెళ్లి కారణంగా భర్తను ఓ భార్య స్నేహితులతో కలిసి ప్లాన్ ప్రకారం హత్య చేసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గౌరీశంకర్ రావుకు సరస్వతికి గతనెల 28న పెళ్లికాగా.. సోమవారం వీరు బైక్‌పై వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే మరణించగా.. భార్యకు గాయాలయ్యాయి.
తొలుత బంగారం కోసం దుండగులు ఈ దానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఆ తరువాత తమదైన శైలిలో సరస్వతిని విచారించడంతో నిజం బయటకి వచ్చింది. సరస్వతి తన మిత్రుడు శివ, విశాఖ రౌడీషీటర్ గోపితో భర్తను హత్య చేయించినట్లు తెలుస్తోంది. ప్లాన్ ప్రకారమే భర్తపై దాడి చేయించినట్లు, హత్యచేయించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.