Happy Republic Day 2023: దేశంపై మక్కువను, దేశభక్తిని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఎవరికి తోచిన రీతిలో వారు తమ దేశ భక్తిని ప్రదర్శిస్తుంటారు. అలాగే 2023 రిపబ్లిక్ డే వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త పేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) అనే ఒక కళాకారుడు 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా చిత్రాలను వేసి తన దేశ భక్తిని చాటుకున్నాడు. అవును.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఆ బియ్యం గింజలకు మువ్వన్నెలు తెచ్చాడు.
ఒక్క బియ్యం గింజపై జాతీయ జండా రంగులు అద్దడానికే కష్టం అని అనుకుంటే.. అతడు ఏకంగా 5 లక్షల బియ్యపు గింజలపై త్రివర్ణ పతాకాన్ని చూపించి చూపరులను ఔరా అనిపిస్తున్నాడు. ఇందుకోసం రామం పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు.
గతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నెల 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి తీసుకెళ్లినట్టు రామం తెలిపాడు.
ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు
ఇది కూడా చదవండి : Republic Day 2023: భారత దేశంలో మొదటి 'రిపబ్లిక్ డే' ఎక్కడ జరిగిందో తెలుసా?.. రాజ్‌పథ్‌లో మాత్రం కాదు!
ఇది కూడా చదవండి : 2023 Maruti Suzuki Jimny: మారుతి సుజుకి నుంచి జిమ్నీ5 డోర్.. ఆ రెండు కంపెనీల ఎస్‌యూవీలకు పోటీ తప్పదా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook