జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 32,100 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ ఆధ్వరంలో జరిగిన ఈ పనులు గంటకు సగటున 1,300 ఘనపు మీటర్ల నుంచి 1,400 ఘనపు మీటర్ల వరకూ సాగాయి. ఆదివాదం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కాంక్రీడ్ పనులు.. సోమవారం సరిగ్గా ఉదయం 8 గంటలకు ముగిశాయి.
యూఏఈ రికార్డు బద్దలు...
కాంక్రీట్ పనులను స్వయంగా పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు..ఇంత భారీగా ఎక్కడా ఒక రోజులో పనులు సాగలేదని తెలిపారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించినట్లు తెలిపారు. గతంలో యూఏఈకి చెందిన RALS కన్సల్టింగ్ సంస్థ 24 గంటల వ్యవధిలో 21,580 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేశారని పేర్కొన్న గిన్నీస్ ప్రతినిధులు..ఈ రికార్డును నయయుగ ఇంజినీరింగ్ సంస్థ బద్దలు కొట్టిందని తెలిపారు