ఏపీ టూరీజానికి అరుదైన గుర్తింపు ; అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక

తెలుగు నేలకు అరుదైన గుర్తింపు లభించింది.

Last Updated : Jan 17, 2018, 02:12 PM IST
ఏపీ టూరీజానికి అరుదైన గుర్తింపు ; అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక

ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలకు పుట్టిల్లు . ఇక్కడ ఉన్న అందచందాలను చూసిన ప్రకృతి ప్రేమికలు ఈ ప్రదేశాన్ని కోహినూర్ ఆఫ్ ఇండియాగా పేరుపెట్టారు. ప్రఖ్యాతి గాంచిన ఈ నేల యోక్క ప్రత్యేకతను గుర్తించి అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక చేశారు..వివరాల్లోకి వెళ్లినట్లయితే పసిఫిక్ ప్రాంత పర్యాటక రచయితల సంస్థ ఏపీని అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. ఏపీ టూరిజం శాఖకు మార్చి 9న బెర్లిన్‌ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం చేయనుంది.  ఈ మేరకు ప‌సిఫిక్ ప్రాంత ప‌ర్యాట‌క ర‌చ‌యితల సంస్ధ ఓ ప్రకటనలో తెలిపింది.

అవార్డు ఎంపికకు కారణాలు ఇవే ..
ఏపీలో ఫ్యామిలీతో పాటు పర్యటించాల్సిన ప్రాంతాలు అనేకం.  తిరుపతి, ద్వారక తిరుమల, శ్రీశైలం, శ్రీ కాళహస్తి, సింహాచలం, అన్నవరం, అహొబిలం, మహానంది, కానిపాకం, విజయవాడ దుర్గ గుడి మొదలైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచములోకెల్లా ఐశ్వర్యవంతమైన హిందూ దేవాలయము. విశాఖపట్నం, పేరిపాలెం, గొల్లపాలెం, మచిలీపట్నం వంటి ఎన్నో బీచ్ లు ఉన్నాయి. అరకు లోయ, బొర్రా గుహలు, పాపి కొండలు,  లంబసింగి వంటి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాగా పర్యటక అభివద్ధిపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఏపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలను  పసిఫిక్ పర్యాటక రచయితలు ప్రసంశించారు. కాగా పర్యటకానికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.

టాప్ -10 ఏపీ పర్యాటక ప్రాంతాలు..

Trending News