Somasial Project: నెల్లూరు జిల్లాకు వరప్రదాయిని, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిల ప్రాజెక్టు రూపురేఖలు మారిపోతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలంలో ప్రాజెక్టు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భవిష్య వాణిలో బ్రహ్మంగారు చెప్పిన విధంగా నెల్లూరు జిల్లా నేలమట్టం అన్న మాట నిజం కానుందా అని సోమశిల పరివాహక ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్టు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆ ప్రాంతం అంతా పర్యాటకంగానూ పూర్తిగా దెబ్బతింది. ఎంతో పురాతనమైన, చరిత్ర కలిగిన శివాలయం సైతం వరదల్లో కొట్టుకుపోయింది. ప్రాజెక్ట్‌లోని కాంక్రీట్ దిమ్మలు నీటి ప్రవాహానికి కరిగిపోయాయి. సుమారు పది నుంచి 20 అడుగుల మేర గుంతలు పడ్డాయి. వరద ఉధృతికి భారీ రాళ్లు కొట్టుకువచ్చాయి. స్థానికంగా భయానక వాతావరణం కనిపిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
1988లో అప్పటి సీఎం ఎన్టీఆర్ చేతుల మీదుగా సోమశిల ప్రాజెక్ట్ ప్రారంభమైంది. కాల క్రమేన ప్రాజెక్ట్‌పై ప్రత్యేక పర్యవేక్షణ లేకుండా పోయింది. దీంతో సోమశిల జలాశయం వద్ద భూకంపం వచ్చిందా అన్న చందా పరిస్థితులు ఉన్నాయి. పూర్తి దెబ్బ ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రాష్ట్రప్రభుత్వం 117 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈఏడాది మొదట్లో ప్రారంభం కావాల్సిన పనులు నాలుగు నెలలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి.
సోమశిల ప్రాజెక్ట్‌లో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. రెండు రాష్ట్రాలకు సాగుతాగు నీరు ప్రాజెక్ట్‌గా ఉన్న ప్రాంతంలో రాత్రల్లో చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. కరెంట్ పోతే జనరేటర్లు పనిచేయని పరిస్థితి ఉంది. మరోవైపు సోమశిల ప్రాజెక్ట్‌ను సందర్శించేందుకు పర్యాటకులు సైతం రావడం లేదు. ఎంతో ఆహ్లాదకంగా ఉన్న ప్రాంతం నిర్మానుష్యంగా మారుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 71 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఆ నీటిని దిగువకు విడుదల చేసినా..గేట్లు ఉంటాయో..కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం జగన్..ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Also read:Kabul: కాబుల్‌లో ఆత్మాహుతి దాడి..20 మంది మృతి..పలువురికి గాయాలు..!
Also read:CM Kcr on BJP: ఢిల్లీలో వచ్చేది మన ప్రభుత్వమే..మరోమారు ప్రధాని మోదీపై కేసీఆర్ ధ్వజం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి