Summons To Vijayamma and Sharmila: వైఎస్ విజయమ్మ, షర్మిలకు స్పెషల్ కోర్టు సమన్లు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ప్రత్యేక న్యాయస్థానం వైఎస్ విజయమ్మ, షర్మిలకు సమన్లు జారీ చేసింది. కోర్టుకు హాజరు కావాలని సమన్లలో సూచించింది.

Last Updated : Jan 7, 2020, 11:15 AM IST
Summons To Vijayamma and Sharmila: వైఎస్ విజయమ్మ, షర్మిలకు స్పెషల్ కోర్టు సమన్లు

హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి (విజయమ్మ), ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలకు ప్రత్యేక కోర్టు షాకిచ్చింది. 2012కు సంబంధించిన కేసులో వీరిద్దరికి కోర్టు సమన్లు జారీ చేసింది. ఏ1, ఏ2లుగా ఉన్న వీరితో పాటు ఇదే కేసులో ఏ3, ఏ4లుగా ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిలకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. 

జనవరి 10వ తేదీన ప్రత్యేక కోర్టులో హాజరు కావాలని సమన్లలో సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరకాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముందస్తుగా అనుమతి లేకుండా రోడ్డుపై సభ నిర్వహించారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపిస్తూ పరకాల పోలీస్ స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేశారు. 

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ సైతం అదే రోజూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నమోదైన ఆర్థిక కేసులను ఆయన తనయుడు వైఎస్ జగన్ నేటికీ ఎదుర్కొంటున్నారు. గతంలో దాదాపు ఏడాదిన్నరకాలం జైలులో విచారణ ఎదుర్కొని బెయిల్‌పై విడుదలయ్యారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

 

Trending News